తెలంగాణ‌లో మ‌రో స‌ర్వే విడుద‌ల

272

తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.. ఈ స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో గెలుపు కోసం పార్టీలు కూట‌మి త‌ర‌పున కాంగ్రెస్ తెలుగుదేశం అలాగే ఇటు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో తెలంగాణ‌లో స‌ర్వేలు షాక్ తెప్పిస్తున్నాయి. ఇప్ప‌టికే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ డిసెంబ‌రు 07న స‌ర్వే ఫ‌లితాలు చెబుతాను అని అన్నారు అయితే ఇప్పుడు నిన్న సాయంత్రం వ‌చ్చిన స‌ర్వే రిపోర్టుతో పెద్ద ఎత్తున చ‌ర్చ అయితే జ‌రుగుతోంది. ఇప్పటికే సీపీఎస్ స‌ర్వే పేరిట టీఆర్ఎస్‌కు 94 నుంచి 104 సీట్లు వ‌స్తాయ‌ని… కూట‌మికి కేవ‌లం 16 నుంచి 21 స్థానాలు వ‌స్తాయ‌ని తేల్చారు.

ఇప్పుడు తాజాగా నేష‌నల్ స‌ర్వే బ‌య‌ట‌కు వ‌చ్చింది… తాజాగా ఎన్డీటీవీ తెలంగాణ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ స్వయంగా ఈ సర్వేను పర్యవేక్షించి ఆ ఫలితాలను ప్రకటించారు. జ‌నం నుంచి ప‌బ్లిక్ ప‌ల్స్ ఓపినీయన్ పోల్స్ ఆధారంగా తెలంగాణలో టీఆర్ఎస్ కు 66 సీట్లు, కాంగ్రెస్+టీడీపీ కూటమికి 39 సీట్లు, ఎంఐఎంకు 7, బీజేపీకి 4 సీట్లు, ఇతరులు మూడు సీట్లు గెలుస్తారని ఎన్టీటీవీ తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ఒక్క స‌ర్వేలో కూడా కూట‌మికి పాజిటివ్ టాక్ రాక‌పోవ‌డంతో పెద్ద చ‌ర్చ అయితే జ‌రుగుతోంది తెలంగాణ వ్యాప్తంగా.