రెచ్చిపోయిన పాక్.. మరో పుల్వామా దాడి జరగొచ్చని వార్నింగ్..

196

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కాశ్మీర్ పై ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజన నిర్ణయాలు పొరుగున ఉన్న పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్ తన భూభాగంలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. అదేదో దాని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నంతగా రెచ్చిపోతోంది. కాశ్మీర్ సమస్యపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టేలా ప్రసంగించారు.

Image result for pakistan prime minister imran khan

పాకిస్తాన్ పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం.. భారత్ పట్ల పాక్ కు ఉన్న సహజ ద్వేషాన్ని బయట పెట్టింది. బిజెపిది జాత్యహంకార భావజాలమని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ముస్లింలను భారత్ లో రెండో తరగతి ప్రజలుగానే చూస్తోందని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం, మహ్మద్‌ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని బలపరుస్తుందని ఆయన కామెంట్ చేశారు.

Image result for modi

భారతదేశం కేవలం హిందువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందంటూ కాశ్మీరీ ముస్లింలను రెచ్చగొట్టేపనిలో పడ్డారు పాక్ ప్రధాన మంత్రి. పాకిస్తాన్‌ మాత్రం మానవులందరిని సమానంగా చూస్తుందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగితే బాగానే ఉండేది.. ఈ తరహా స్పందన పాకిస్థాన్ నుంచి ఊహించిందే.. కానీ అక్కడే ఇమ్రాన్ ఖాన్ లక్ష్మణ రేఖ దాటారు. భారత్ కు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

ఈ క్రింద వీడియో చూడండి

నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల త్వరలోనే మరో పుల్వామా దాడి జరగవచ్చని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ఈ మాటలు కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఎలా కారణమవుతుందో చెప్పకనే చెబుతున్నాయి. వాస్తవానికి భారత్ సర్కారు ఇలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని పాకిస్థాన్ ముందుగానే ఉహించింది. గత సార్వత్రిక ఎన్నికల ముందే.. ఏకంగా పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదులను మట్టు బెట్టిన మోడీ సర్కారు.. మరోసారి గెలిచిందంటే.. కాశ్మీర్ భద్రత కోసం భారీ చర్యలు తీసుకుంటుందని ఇమ్రాన్ ఊహించిన విషయమే. ఇప్పుడు అందుకు అనుగుణంగానే అడుగులు పడటం పాక్ జీర్ణించుకోలేకపోతోంది.