వైసీపీలో చేరిన మరో అధికారి

341

ఉత్తరాంధ్రాలో పాద‌యాత్ర‌లో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్ర‌జామద్ద‌తు ఉంటోంది…ముఖ్యంగా జ‌గ‌న్ పాదయాత్ర‌కు ప్ర‌జలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు… పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ కు ఇప్ప‌టికే ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు తెలియ‌చేస్తున్నారు అలాగే వైసీపీ త‌ర‌పున ఆయ‌న న‌వ‌ర‌త్నాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు తీసుకువెళుతున్నారు…

Image result for jagan padayatra

ఈ స‌మ‌యంలో పార్టీలో కొంద‌రు నాయ‌కులు చేరిక పార్టీకి మరింత బూస్ట్ అవుతుంది.. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మ‌ల్సీలు మంత్రేలు కూడా పార్టీలో చేరుతున్నారు.. ఈ స‌మ‌యంలో తాజాగా వైసీపీలో మ‌రో సీనియ‌ర్ అధికారి చేరారు.గుంటూరు జిల్లా గురజాలకు చెందిన రిటైర్డ్‌ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం వైసీపీలో చేరారు. గుంటూరు నుంచి పెద్ద ఎత్తున మద్దతుదారులతో పెందుర్తి వచ్చిన ఆయన… రాజయ్యపేటలో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఏసురత్నానికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Image result for jagan padayatra

మొత్తానికి వైసీపీలో ఇలా చేరిక‌లు ఉండ‌టంతో వ‌చ్చేఎన్నిక‌ల్లో వైసీపికి తిరుగుఉండ‌దు అని అంటున్నారు పార్టీ నాయ‌కులు ముఖ్యంగా జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు కూడా న‌చ్చి నాయ‌కులు పార్టీలో చేరుతున్నారు అని అంటున్నారు .