వైయ‌స్ ఇంట్లో మ‌రోదారుణం మ‌రో హ‌త్య షాక్ లో పోలీసులు కుటుంబ‌స‌భ్యులు

475

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అకాల మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పులివెందుల్లోని వైఎస్‌ వివేకానంద రెడ్డి నివాసంలో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అసలేం జరిగింది? బెడ్‌ రూమ్‌లో ఏసీ ఉన్నప్పటికీ డోర్‌ ఎందుకు ఓపెన్‌ చేసి ఉంది? సైడ్‌ డోర్‌ లాక్‌ ఎవరు తీశారు? అనే కోణాల్లో విచారణ జరపుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ ఫిర్యాదుపై పులివెందుల సీఐ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిపై సెక్షన్‌ 171 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాత్రూమ్‌లో పడి ఉన్నారని, తలపై గాయాలున్నాయని, ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇక సిట్ ద‌ర్యాప్తు కూడా ముమ్మ‌రంగా జ‌రుపుతోంది, ఇక కొత్త వ్య‌క్తులు ఏమైనా ఇటువైపు వ‌చ్చారా ఎలాంటి విష‌యాలు వ‌ద‌ల‌కుండా అన్ని తెలుసుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో సిట్ కు మ‌రో కీల‌క విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Image result for ys family
 మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతం పథకంలో మరో కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల వైఎస్‌ వివేకా ఇంటి పరిసరాల్లో ఉన్న ఓ కుక్కను గుర్తు తెలియని దుండగులు కర్రలతో కొట్టి చంపారు. ఇంటి ఆవరణ, రహదారి వైపు కొత్త వ్యక్తులు ఎవరైనా తచ్చాడితే రయ్యిన మొరుగుతూ వారిపైకి ఉరికేది. అటు వైపు కొత్త వ్యక్తులు వచ్చేందుకు సాహసం చేయలేని విధంగా పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల ఆ కుక్కను ఎవరో కొట్టి చంపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అప్పట్లో వైఎస్‌ వివేకానందరెడ్డి ఊదాసీనంగా వ్యవహరించిన ఫలితమే ప్రాణాలు మీదకు తెచ్చిందా? అనే అనుమానాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా రెక్కీ నిర్వహించడం, లేదా పథకంలో భాగంగా హత్య చేసేందుకు వచ్చినవారిని కుక్క అడ్డగించడంతోనే అప్పట్లో చంపేశారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకే కుక్క‌ని చంపారు అని అది సాదార‌ణంగా చ‌నిపోయింది అని అనుకున్నారు కాని ఇంత దారుణం జ‌రుగుతుంది అని ఎవ‌రూ ఊహించ‌లేద‌ని ఆయ‌న భార్య పిల్ల‌లు ఎవ‌రూ ఇంటిలో లేని స‌మ‌యం చూసుకుని దాడికి పాల్ప‌డ్డారు అని తెలుస్తోంది, ఇక క‌చ్చితంగా ప్లాన్ గా మ‌ర్డ‌ర్ చేశారు అంటున్నారు స్ధానికులు. ఇక నాలుగు రోజులుగా ఇక్క‌డ సీసీ కెమెరాల‌ను కూడా ప‌రిశీలిస్తున్నారు సిట్ బృందం.