ప్ర‌త్యేక‌హూదా కోసం మ‌రో బ‌లిదానం

399

ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌న కోసం నాయ‌కులు పోరాటాలు చేస్తున్నా ఎటువంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌క‌పోవ‌డంతో నాయ‌కుల‌పై ప్ర‌జ‌ల‌కు అనుమానాలు మ‌రింత పెరిగిపోతున్నాయి… ప్ర‌త్యేక హూదా సాధ‌న ఉంటుందా లేదా అని ఆలోచ‌న‌లు ఆలోచిస్తున్నారు.. ఇక యువ‌త కూడా దీనిపై పోరాటాల‌కు సిద్దం అవుతున్నారు..కాని కొంద‌రు ఆత్మ‌బ‌లిదానాల‌కు పాల్ప‌డుతున్నారు.. తాజాగా ఇలాంటి దారుణం జ‌రిగింది ఆంద్ర‌ఫ్ర‌దేశ్ లోని చిత్తూరు జిల్లాలో.


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మరో ఆత్మ బలిదానం జరిగింది. ఈ విషాద ఘటన మదనపల్లిలోని గౌతమినగర్‌లో చోటుచేసుకుంది. సుధాకర్ అనే చేనేత కార్మికుడు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సూసైడ్ నోట్ రాశారు. దీంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఆత్మహత్యకు ముందు సుధాకర్ ఓ మంచి కార్యక్రమం చేసి ప్రాణాలు వదిలారు. చైతన్య బాలల అనాథాశ్రమానికి రూ.5వేలు సహాయం చేసి దాతృత్యాన్ని చాటుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణంపై ఇటువైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఈ విష‌యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పేర్కొంది. సుధాక‌ర్ ఇలా ఆత్మ‌బ‌లిదానం చేసుకోవ‌డంతో నేత‌లు ఆయ‌నకు నివాళి అర్పించారు.. అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో అత‌ని కుటుంబం, స్నేహితులు బంధువులు క‌న్నీటి ప‌ర్వంతం అవుతున్నారు.