టీడీపీకి మ‌రో నేత గుడ్ బై

408

తెలంగాణ‌లో టీడీపీకి ఇప్పుడు ఎదురుప‌వ‌నాలు వీస్తున్నాయి.. కాంగ్రెస్ తో పొత్తు అనేస‌రికి పార్టీలో ఉన్న కొంద‌రు దీనిని వ్య‌తిరేకిస్తున్నారు. అయినా కొంద‌రు మాత్రం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు క‌లిసి ముందుకు వెళ‌తాయి అని సంకేతాలు ఇస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యాలు తెలంగాణ‌లో పార్టీకి ప్ల‌స్ అవుతాయా లేక మైన‌స్ అవుతాయా అని అంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పై పోరాటం చేసి వ్య‌తిరేకించి ,నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారు ఇప్పుడు అదే పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందా అని అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం నేత‌లు.

Image result for ఆర్‌.కృష్ణయ్య

ఇక టీ.ఆర్.ఎస్ పార్టీపై వ్య‌తిరేక‌త‌ను బ‌లంగా చేసుకోవాలి అని ప్ర‌తిప‌క్షాలు అన్నీ మ‌హాకూట‌మిగా మారాలి అని భావిస్తున్నాయి.. ప్రస్తుతం బీసీ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పార్టీ తీరుపై అదేవిధంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.. గ‌తంలో త‌న‌ను సీఎంని చేస్తాను అని అన్నారు అది ప‌క్క‌న పెట్టారు.

Image result for ఆర్‌.కృష్ణయ్య

2014 ఎన్నిక‌ల్లో త‌న‌ను సీఎం అభ్య‌ర్ది అని ప్ర‌క‌ట‌న కూడా చేశారు. కాని పార్టీ త‌ర‌పున త‌న‌కు ఎటువంటి మ‌ర్యాద ఇవ్వ‌లేదు అని ఆయన అన్నారు.తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ పొత్తుల విష‌యంపై ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. పార్టీ కేడ‌ర్ అలాగే పార్టీ నాయ‌కులు ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపి, ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఓపినియ‌న్ తెలుసుకున్నారు.. త‌న‌తో ఈ పొత్తుల గురించి ఒక్క‌మాట కూడా చెప్ప‌లేదు అని అన్నారు ఆయ‌న.. ఇక టీడీపీకి రాజీనామా చేసే యోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక త్వ‌ర‌లో ఆయ‌న ఏ పార్టీలో చేరుతారు అనేది తెలియ‌చేయ‌నున్నారు.