ఆగ‌ష్టు 1 నుంచి అన్నాక్యాంటీన్లు మూసివేత జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

160

అన్న క్యాంటీన్లు మూతపడనున్నాయా..? లేదంటే కొత్త పేరుతో ఈ పథకం అమలులోకి రానుందా..? ఈ రెండింటిలో ఏది జరుగుతుందో కాని.. ప్రస్తుతానికి మాత్రం ఆగస్టు ఒకటో తేదీ వరకు అన్న క్యాంటీన్లు ఉండబోతున్నాయి. అప్పటివరకే భోజన సదుపాయం ఉంటుంది. ఎందుకంటే అన్న క్యాంటీన్లకు భోజనం నిర్వహణ చూస్తున్న అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నిర్వహణ నిలిపివేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టరేట్‌ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆయా పట్టణాలు, నగరాల కమిషనర్లు సంస్థ వారికి కూడా చేరవేశారు. అయితే తదుపరి ఏం చేస్తారన్న విషయంలో ఉన్నతాధికారులకు కూడా ఇంకా స్పష్టత లేదు.

Image result for anna canteen

జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, 7 మున్సిపాల్టీలు, 2 నగరపాలక పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ద్వారా అన్నార్తులకు రూ.5లకే భోజనాలు పెట్టే ఏర్పాట్లను గత ప్రభుత్వం చేసింది. మొత్తం 20 క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం, అల్పాహారం పెడుతూ వస్తున్నారు. వలస కూలీలు, కార్మికులు, పనుల మీద వచ్చే పేదవర్గాలకు ఈ క్యాంటీన్లు ఆకలిని తీరుస్తున్నాయి. నిర్వహణ తీరు, ఆహార పదార్థాలు కూడా బాగుండడంతో పేదలంతా ఇక్కడకు వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అన్న క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతూ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా ఈ క్యాంటీన్లకు ఉన్న పసుపు రంగును తొలగించి తెలుపు రంగులు వేశారు. జనం కూడా ప్రభుత్వం మారిందికాబట్టి పేరు మారుస్తారేమో అన్న ఆలోచనతో ఉన్నారు. క్యాంటీన్లు ఆటంకం లేకుండా నడుస్తుండడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఈ క్రింద వీడియోని చూడండి

తాజాగా ఈ క్యాంటీన్ల నిర్వహణ నిలిపివేయాలని అక్షయపాత్ర సంస్థకు ఆదేశాలు రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. అయితే కొందరు ఈ క్యాంటీన్లను రూపుమార్చి మళ్లీ ప్రారంభిస్తారని చెబుతుండగా, ఈ పథకాన్ని తాత్కాలికంగానైనా నిలిపివేయడం సరికాదని చాలామంది అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి జూన్‌ నుంచి భోజనాల సంఖ్య తగ్గిస్తూ, జూలైలో కూడా మరింతగా తగ్గిస్తూ చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఏకంగా నిర్వహణను నిలుపుదల చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో ప్రకటించారు. 2018లో జూలైలో పథకాన్ని ప్రారంభించారు. ఒక్కొ అన్న క్యాంటీన్‌ భవనాన్ని, వంట సామాగ్రితో కలిపి రూ.35 లక్షలతో నిర్మించారు. దీనికి ప్రజల నుంచి స్పందన రావడంతో అప్పటి సీఎం చంద్రబాబు ఇందులో జనాల సౌకర్యార్థం ఏసీలు ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం రూ.5లకే అందించారు. దీనికి ప్రభుత్వం రూ.58 చొప్పున భోజనానికి చెల్లించేది.