సెప్టెంబ‌ర్ 2న వైసీపీ తీర్ధం

451

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులుగా చేరుతారు అని వార్త‌లు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి ..ఆయ‌నే టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి.. ఇక ఆయ‌న తాజాగా వైసీపీలో ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు అని తెలుస్తోంది.. శ్రావ‌ణ‌మాసంలో ఆయ‌న వైసీపీలో చేరుతారు అని అనుకున్నారు అంద‌రూ.. ఇక ముహూర్తం ప్ర‌క‌టించారు ఆయ‌న‌.. వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ 2న వైసీపీలో చేరాలి అని నిర్ణ‌యించారు. తాజాగా ఈ విష‌యాన్ని ఆయ‌న సన్నిహితులు వైసీపీ నాయ‌కులు తెలియ‌చేస్తున్నారు.

Image result for ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

ఇక ఆనం నుంచి ఈ గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో ఇది జ‌గ‌న్ కు కూడా తెలియ‌చేశారు… ఇక విశాఖ‌లో పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ను ఆయ‌న సెప్టెంబ‌ర్ రెండోవ తేదిన క‌లవ‌నున్నారు. ఆ రోజే పార్టీలో ఆయ‌న చేర‌నున్నారు. వైయ‌స్సార్ వ‌ర్ధంతి రోజు కావ‌డం వైసీపీ నేత‌లు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రిగే చోట వ‌ర్ధంతి కార్య‌క్రమం ఏర్పాటుచేయ‌నున్నారు ఈ స‌మ‌యంలో వైసీపీలో ఆయ‌న చేరుతారు అని తెలుస్తోంది.. ఆనం ఫ్యామిలీ ముందు నుంచి చంద్ర‌బాబుని న‌మ్మడం లేదు, చాలా మోస‌పోయాం అని బ‌హిరంంగా విమ‌ర్శించారు ఆనం సోద‌రులు.

Image result for ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

ఇక నేదురుమ‌ల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా వైసీపీలో సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో చేర‌నున్నారు అని తెలుస్తోంది ఆయ‌న కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.. అలాగే ఆయ‌న ఎంట్రీకి వెంక‌ట‌గిరి నుంచి పెద్ద కాన్వాయ్ లో విశాఖ చేరుకోనున్నారు అని తెలుస్తోంది. ఇద్ద‌రి చేరిక వైసీపీకి మ‌రింత లాభం చేకూర్చుతాయి అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. జిల్లాలో ఇది వైసీపీకి మ‌రింత బూస్టింగ్ ఇచ్చే అంశం