వైకాపా లో ఆనం చేరిక ఎప్పుడంటే…!

361

ఆనం సోదరులు…రామ నారాయణ రెడ్డి, వివేకానందా రెడ్డి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు..గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం తరువాతి రాజకీయ పరిణామాలతో వీరు తెలుగుదేశం పార్టీలో చేరారు..ఆ తరువాత ఆనం వివేకానంద రెడ్డి అనారోగ్యంతో మరణించారు..అయితే ప్రస్తుతం టిడిపి లో ఉన్న ఆనం .రామ నారాయణ రెడ్డి అక్కడి వాతావరణం పరిస్థితులు నచ్చకపోవటం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెఢీ అవుతున్నారు. ఆనం పార్టీ మారే విషయంపై గడిచిన కొంతకాలంగా ఆసక్తికర చర్చ నడుస్తున్నా.. ఆయన ఎంట్రీ ఎప్పుడన్న దానిపై క్లారిటీ లేదు…

తాజాగా ఈ అంశంపై స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం నడుస్తున్న ఆషాడమాసం ముగిసి.. శ్రావణంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆయన పార్టీలో చేరేందుకు రెఢీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వైఎస్ జగన్ తో ఆనం భేటీ కావటం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ పాదయాత్ర విశాఖపట్నానికి చేరుకున్న వెంటనే ఆయన ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 13న ఆయన జగన్ పార్టీలో చేరే వీలుందని చెబుతున్నారు. విశాఖలో నిర్వహించే బహిరంగ సభా వేదికపై జగన్ సమక్షంలో ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఆనం పార్టీ వీడటంపై తెలుగు తమ్ముళ్లు ఒకింత ఇబ్బందికి గురి అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడైనా విపక్షంలో నుంచి అధికారపక్షంలోకి చేరుతారు. ఇందుకు భిన్నంగా అధికారపక్షం నుంచి విపక్షంలో వస్తున్న వైనం చూస్తే.. ఏపీలో రాజకీయ వాతావరణం ఎంతలా మారిందో ఇట్టే తెలుస్తుందని చెప్పక తప్పదు.