వైసీపీలో చేరిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

291

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఆనం ఫ్యామిలీలో కీల‌క వ్య‌క్తి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ‌లో జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో ఆయన పాద‌యాత్రకు విశేష స్పంద‌న వ‌స్తోంది. ముఖ్యంగా పార్టీలో చేరే నాయ‌కులు, కూడా పెద్ద సంఖ్య‌లో చేరుతున్నారు. ఈ స‌మ‌యంలో ఆనం కూడా ఆయ‌నతో చ‌ర్చించి పార్టీ కండువా క‌పుకున్నారు.. ఇక ఆనం అనుచ‌రులు కూడా పెద్ద ఎత్తున ఆయ‌న వెంట క‌దిలారు. ఆయ‌న‌తో పాటు సీనియ‌ర్లు వైసీపీలో చేరారు.

Image result for ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

ఇక పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ తో క‌లిసి ఆయన కొంత సేపు పాద‌యాత్ర‌లో న‌డిచారు.. ఆత్మ‌కూరు తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఇంచార్జ్ గా ఉన్న ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నికల్లో కూడా టికెట్ ఇస్తారో లేదో తెలియ‌దు.. ఈ స‌మ‌యంలో ఆయన తెలుగుదేశంలో ఉంటే మ‌రింత దారుణ‌మైన ప‌రిస్దితి వ‌స్తుంది అని భావించారు.. ఈ స‌మ‌యంలో ఆయ‌న పార్టీలో ఉండ‌టం కంటే పార్టీ మార‌డం బెట‌ర్ అని ఆయ‌న పార్టీ మారారు.

Image result for ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

ఇక ఆత్మకూరులో వైసీపీ త‌ర‌పున కూడా ఆయ‌న‌కు టికెట్ హామీ రాలేదు.. మ‌రి జ‌గన్ ఎటువంటి హామీ ఆయ‌న‌కు ఇచ్చారు అనేది తెలియాలి.. ఇక ఆయ‌న వెంట పార్టీ నాయ‌కులు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పిన కేడ‌ర్ కూడా వైసీపీలో చేరారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, కూడా ఆయ‌న‌తో క‌లిసి వ‌చ్చారు. మ‌రి చూడాలి ఆయ‌న ఎంట్రీతో ఎటువంటి ప‌రిస్దితి ఇక్క‌డ పార్టీకి ఉంటుందో.. అలాగే నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న్ రెడ్డి త‌న‌యుడు రామ్ కుమార్ రెడ్డి కూడా మ‌రో నాలుగురోజుల్లో పార్టీలో చేర‌నున్నారు.