ఎమ్మెల్యేగా పోటికి అల్లుఅర్జున్ మామ రెడీ ఎక్క‌డ‌నుంచి అంటే ?

523

తెలంగాణ‌లో మ‌రో 20 ఏళ్ల వ‌ర‌కూ టీఆర్ ఎస్ పార్టీకి తిరుగులేదు అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు.. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్య‌ర్దుల కంటే సీఎం అభ్య‌ర్దులు ఎక్కువ అని కామెంట్లు వ‌స్తున్నాయి.. అయితే మ‌రో10 నెల‌లు మాత్ర‌మే సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మ‌యం ఉంది.. ఈ స‌మ‌యంలో పిండి కొద్ది రొట్టెలా, కాంగ్రెస్ క‌ష్ట‌ప‌డ‌టం లేదు అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. క్రింది స్ధాయి కేడ‌ర్ సొంత పార్టీలో ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

Image result for sneha reddy father

ఇక టీఆర్ ఎస్ పిలుపు ఇవ్వ‌క‌పోయినా ఇరుకుగా కారు పార్టీలోకి వ‌చ్చి కూర్చుంటున్నారు నాయ‌కులు.. కాంగ్రెస్ నుంచి ఇటీవ‌ల దానం నాగేంద‌ర్ గులాబీ కండువా క‌ప్పుకొని కారు ఎక్కిన విష‌యం తెలిసిందే. ఇక ఆయ‌నకు ఏ సీటు అనేది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా ఉంది. ఇక హైద‌రాబాద్ లో రిచ్ అంటే జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ఇప్పుడు ఖైర‌దాబాద్ ఎన్నిక‌ల‌కు క్యాస్ట్ లీ సీటు గా మారిపోయింది అని చెప్పాలి.

Image result for sneha reddy father

ఈ స్థానంలో టిక్కెట్ కోసం దానం నాగేందర్ – కార్పొరేటర్లు విజయారెడ్డి – కే కేశవరావు కూతురు విజయలక్ష్మీ – మన్నె గోవర్ధన్ రెడ్డిలు ముందు వరుసలో ఉన్నారు… వీరంతా గతంలో వేరే పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా పోటీచేశారు… దానం కాంగ్రెస్ నుంచి – విజయారెడ్డి వైసీపీ నుంచి – టీఆర్ ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి బరిలో దిగారు… చివ‌ర‌కి అన్నీ గూటి ప‌క్షులు క‌లిసి టీఆర్ ఎస్ గూటికి చేర‌డంతో ఇప్పుడు ఈ టికెట్ ఎవ‌రికి ఇస్తారా అని ఆలోచ‌న అయితే పెరిగిపోయింది ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో. మొత్తానికి వ‌ల‌స నాయ‌కుల‌కే సీటు ఇస్తారా అనే మ‌రో ప్ర‌శ్న ఎదురుఅవుతోంది.

Image result for kancharla chandrasekhar reddyఇక సినీ నటుడు అల్లు అర్జున్ మామ కూడా టీఆర్ ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. ఆయన ఇబ్రహీంపట్నం నేత. కానీ అక్కడ టీఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో తాను నివాసం ఉంటున్న ఖైరతాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక పొలిటిక‌ల్ ఫేమ్ ఉంది.. అల్లుడు ద్వారా సినీ ఫేమ్ ఉంది.. అలాగే ప్ర‌ముఖుల తో ప‌రిచ‌యాలు ఉండ‌టం, విద్యాసంస్ధ‌ల అధినేత కావ‌డంతో ఆయ‌న‌కు టికెట్ ఇస్తారు అనివార్త‌లు వ‌స్తున్నాయి… మ‌రి కేసీఆర్ ఎవ‌రికి క‌టాక్షం క‌ల్పిస్తారో చూడాలి.