టీడీపీకి ఆర్కే పంచ్

364

తెలుగుదేశం పార్టీపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది అని, ఇక పార్టీ పై న‌మ్మ‌కం చాలా వ‌ర‌కూ ప్ర‌జ‌ల్లో లేదు అని, అందుకే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు మ‌రింత పెరుగుతోంది అని తెలియ‌చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల‌రామ‌కృష్ణారెడ్డి, ఇక ఆయ‌న తాజాగా పేద‌వాడు గొప్ప‌వాడు చంద్ర‌బాబు పాల‌న‌లో ఎప్పుడూ అవ్వ‌రు అని విమ‌ర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అన్యాయాలు అక్ర‌మాలు బాగా పెరిగిపోయాయి అని విమ‌ర్శించారు. ముఖ్యంగా టీడీపీ పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెద్ద ఎత్తున పెరిగింది అని, వీరి ప్ర‌భుత్వం ఎప్పుడు దిగిపోతుంది అని ప్ర‌జ‌లు చూస్తున్నారు అని ఆయ‌న అన్నారు.

Image result for TDP

జ‌గ‌న్ నాయ‌క‌త్వం, ఆయ‌న పాల‌న వ‌స్తే ఆయన నాయకత్వంలోనే పేదవాడు గొప్పవాడు, రైతు రాజు అవుతారన్నారు. చంద్రబాబు పాలనలో దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ప్రజలు చూస్తున్నారన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను ధనార్జన కోసం వాడుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రత్యేకహోదా సంజీవని కాదన్న చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని ప్రత్యేకహోదా అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

Image result for alla ramakrishna reddy

చంద్రబాబు దుర్నితిని ఎండగడుతూ నడుస్తున్న జగనన్నకు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు..
ఇక బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింది అని, ఈ అక్ర‌మాల ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు జ‌నం రెడీ అవుతున్నారు అని అన్నారు.. దీంతో తెలుగుదేశం నేత‌లు ఎక్క‌డికక్క‌డ అవినీతి తాండ‌వం చేస్తున్నారు అని విమ‌ర్శించారు.