జ‌గ‌న్ పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు ఆపాలి వైసీపీ సరికొత్త అటాక్

464

నాలుగు సంవ‌త్స‌రాలు తెలుగుదేశం పార్టీకి స‌పోర్ట్ గా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్, ఇప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం జ‌గ‌న్ పై టార్గెట్ చేసి వ్యాఖ్య‌లు చేయ‌డం పై వైసీపీ నాయ‌కులు ఫైర్ అవుతున్నారు.. ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి ప‌వ‌న్ మ‌భ్య పెడుతున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు..
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు ఎమ్మెల్సీ ఆళ్ల‌నాని ప‌వ‌న్ పై ఫైర్ అయ్యారు.. భీమ‌వ‌రంలో జ‌గ‌న్ ని చ‌ర్చ‌కు రావాలి అని ప‌వ‌న్ పిల‌వ‌డం ఏమిట‌ని, ఆయ‌న‌కు అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే అని అన్నారు.. ఎక్క‌డైనా అధికార పార్టీని స‌వాల్ కి పిలుస్తారు ఇక్క‌డ అభివృద్ది జ‌రిగింది అంటే చూపించ‌మ‌ని అడుగుతారు.. కాని ఇక్క‌డ దీనికి రివ‌ర్స్ గా ప‌రిస్దితి ఉంది అని ఆయ‌న విమ‌ర్శించారు.

Image result for jagan

నాలుగు రోజులు భీమ‌వ‌రంలో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాన్ ఒక‌సారి అయినా తుందుర్రు వెళ్లి అక్క‌డ స‌మ‌స్య‌పై చ‌ర్చించారా అని ప్ర‌శ్నించారు ఆయ‌న‌.తుందుర్రు పోరాట సమితి ఎన్నిసార్లు తమ గోడు వెళ్లబోసుకున్నా ప‌వ‌న్ ఏ నాడు స్పందించ‌లేదు, కాని ఇప్పుడు కొత్త‌గా జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయడం ఏమిటి అని ఆయ‌న విమ‌ర్శించారు. జ‌గ‌న్ ఎన్ని స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తున్నా స్పందిస్తున్నా మీకు క‌నిపించ‌డం లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Image result for pawan

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అభివృద్ది నాడు వైయ‌స్ చేశారు అని ఆళ్ల నాని అన్నారు. జిల్లాలో నాటి నుంచి జ‌రిగిన అభివృద్ది ప‌నుల‌పై చ‌ర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నాను అని ఆయ‌న అన్నారు..ఇక తెలుగుదేశం పార్టీ ఎటువంటి రాజ‌కీయాలు చేస్తుందో ప్ర‌జ‌లు చూస్తున్నారు.. వ‌చ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి స‌రైన బుద్ది చెబుతారు అని ఆయ‌న అన్నారు. వ‌చ్చే ఎన్నికల్లో ఈ ఫిరాయింపు నాయ‌కులకు కూడా స‌రైన గుణ‌పాఠం చెబుతారు అని అన్నారు ఆయ‌న.