పవన్‌కల్యాణ్ పై సంచ‌ల‌న కామెంట్లు చేసిన అలీ జ‌గ‌న్ సీఎం అవ్వాలి అంతే

261

ప్రముఖ సినీ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో.. సోమవారం ఉదయం అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఆయన వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయ్యారు. నిన్న మొన్నటి వరకూ కూడా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఒకానొక సందర్భంలో అలీ.. రేపో మాపో టీడీపీ కండువా కప్పుకుంటారని పుకార్లు వచ్చాయి. అయితే అందరికీ షాకిచ్చిన అలీ సడన్‌‌గా వైసీపీ గూటికి చేరుతుండటం గమనార్హం.

Image result for ali join ysrcp

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అలీ మాట్లాడుతూ.. ‘‘జగన్ వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు నమ్ముతున్నారు. నేను ఆయన్ని గతంలో కలిసి మాట్లాడాను. ఆయన నన్ను రమ్మని ఆహ్వానించారు.. కానీ నేనే కొంత సమయం కావాలని కోరాను. 1999లో ఓ పార్టీ కండువా కప్పుకున్నాను.. మళ్లీ 2019 ఈ పార్టీ కండువా కప్పుకున్నాను. కచ్చితంగా మంచి మెజారిటీతో జగన్‌ని సీఎం చేయడమే నా ధ్యేయం’’ అని అలీ అన్నారు.అయితే పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ చాలా మందికి హామీ ఇచ్చిన కారణంగా తనకు టికెట్ దక్కే అవకాశం లేదని, అందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. కేవలం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని అలీ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ జగన్ తనకు రాజమండ్రి కానీ విజయవాడ టికెట్ ఇస్తే.. తప్పకుండా పోటీ చేస్తానని అలీ పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో శుభాకాంక్షలు చెప్పేందుకే చంద్రబాబు నాయుడుని, పవన్‌కల్యాణ్‌ని కలిశాను కానీ రాజకీయం కోసం కాదని ఆయన తెలిపారు. అలీ వెంట నటుడు కృష్ణుడు ఉన్నారు. కాగా.. టికెట్‌పై జగన్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే తన మిత్రుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కాదని వైసీపీలో ఎందుకు చేరారనే ప్రశ్నించగా.. ‘‘స్నేహం వేరు, రాజకీయం వేరు. పవన్‌కల్యాణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన సక్సెస్ అయితే.. నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. నాకు అన్ని పార్టీలు, అందరూ తెలిసినవారే. కానీ జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా అందుకు చేయూతని అందిద్దాం అని చెప్పి నేను వైసీపీలో చేరాను’’ అని అలీ తెలిపారు. అయితే పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ చాలా మందికి హామీ ఇచ్చిన కారణంగా తనకు టికెట్ దక్కే అవకాశం లేదని, అందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. కేవలం పార్టీ తరఫున ప్రచారం చేసి జగన్‌ను సీఎం చేస్తానని అలీ స్పష్టం చేశారు.మ‌రి ప‌వ‌న్ స‌క్సెస్ అవ్వాలి అని కోరుకున్న అలీ సీఎం మాత్రం జ‌గ‌న్ అవ్వాలి అని కోరుకున్నారు.