తెలంగాణ టూర్ లో మోడీ కెసిఆర్ పై నిప్పులు చెరిగిన రాహుల్..!

331

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి తెలంగాణ టూర్ లో భాగంగా నిన్న జరిగిన శేరి లింగంపల్లి బహిరంగ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపి నిప్పులు చెరిగారు..కేంద్రం లోని ఎన్ డి ఏ రాష్ట్రం లోని టి ఆర్ ఎస్ ప్రభుత్వాల తీరు ఒకే విధంగా ఉందని అన్నారు..నేను ప్రధానిని కాదు కాపాలదారుడిని అని చెప్పే ప్రధాని మోడీ రాఫెల్ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు..యుపిఎ ప్రభుత్వ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు భాద్యతలను హెచ్ ఎ ఎల్ కు అప్పగించామని, మోడీ ఫ్రాన్స్ వెళ్లి ఏ అనుభవం లేని అనిల్ అంబానీకి సదరు కాంట్రాక్ట్ అప్పగించారని తీవ్ర విమర్శలు గుప్పించారు..రాఫెల్‌ విమానాల ధరలు చెప్పలేమని, ఈ విషయంలో రహస్య ఒప్పందం ఉందని రక్షణ మంత్రి అంటున్నారు. ఆ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడిని అడిగితే అటువంటి ఒప్పందం ఏదీ లేదని చెప్పారని అన్నారు..

ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని మోదీ అంటే.. తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్‌ ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని అసత్య వాగ్దానాలే చేశారని ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీలానే కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని, ఇక్కడ ఒకే కుటుంబం చేతిలో అధికారం ఉందని అన్నారు. దళితులకు మూడు ఎకరాలు, 22 లక్షల మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని హమీ ఇచ్చారు. ఇంత వరకు నెరవేర్చలేదు. ఇంటికో ఉద్యోగమని చెప్పి, నాలుగున్నరేళ్లలో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీకి టీఆర్ఎస్ ఎందుకు మద్దతిచ్చిందని నిలదీశారు.