అక్రమాస్తుల కేసులు జగన్ మీద…అక్రమాస్తులు మాత్రం చంద్రబాబు వద్ద..రోజా సంచలన వ్యాఖ్యలు…

497

వైసిపి లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన నగరి ఎమ్మెల్యే నటి రోజా మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డారు..చంద్రబాబు కు చిన్న మెదడు చిత్లిపోయిందని అందుకే అర్ధం పర్దం లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని ఘాటు వ్యాఖ్యలు చేసారు.. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకోలేదని బాబు చెప్పటం కామెడీగా ఉందన్న ఆమె.. దేశంలోనే ఎవరికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మీద విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నారన్నారు. తమ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత నుంచి బాబు యూటర్న్ తీసుకొని.. హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నట్లు చెప్పారు.

అక్రమాసుల కేసులు జగన్ మీద ఉన్నాయని.. కానీ.. ఆక్రమాస్తులు మాత్రం చంద్రబాబు దగ్గరే ఉన్నాయంటూ దిమ్మ తిరిగే పంచ్ విసిరారు. కాంట్రాక్టుల కోసం మోడీ పాదాల దగ్గర ఏపీ భవిష్యత్తును తాకట్టు పెట్టారన్న రోజా.. దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎంగా బాబు పేరును చెబుతారన్నారు. అత్యంత ధనవంతుడైన సీఎంగా ఉన్న చంద్రబాబు ఆస్తుల్ని ప్రధాని మోడీ ఎందుకు జప్తు చేయటం లేదని ప్రశ్నించిన రోజా.. రూ.250 కోట్లతో హైదరాబాద్ లో రహస్యంగా కట్టుకున్న ఇంట్లోకి ఒక్క టీడీపీ నాయకుడ్ని కూడా ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.

అవినీతి సొమ్ముతో కట్టారు కాబట్టే.. పార్టీ నేతల్ని ఎవరిని ఇంట్లోకి రానివ్వలేదన్న రోజా.. బాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రజలకు కరువు తెచ్చారని మండిపడ్డారు. తిరుమలలో వేయ్యి కాళ్ల మండపాన్ని టీడీపీ తిరిగి నిర్మించాలని ఈవోకు వినతిపత్రం అందించినట్లు చెప్పిన రోజా.. టీడీడీని ఆర్డీఐ యాక్ట్ కిందకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రోజా చెప్పింది నిజమే..తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని గంటల కొద్దీ మీడియా ప్రతినిధులతో చెప్పుకునే చంద్రబాబు.. తాను కట్టుకున్న కొత్త ఇంటి గురించి పాత్రికేయులకు ఎందుకు చెప్పనట్లు..? అని ఆమె ప్రశ్నించారు…