ఆనంకు లైన్ క్లియర్ చేసిన జగన్

86

ఆనం ఫ్యామిలీ మొత్తం వైసీపీ ఆఫీస్ జగన్ నివాసం అయిన లోటస్ పాండ్ వైపు చూస్తున్నారు అనేది స్పష్టం అయిపోతోంది.. నెల్లూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఈ కుటుంబం గత ఎన్నికల్ల తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరింది.. ఇప్పుడు ఆనం ఫ్యామిలీ టీడీపీ నుంచి మరలా వైసీపీ వైపు అడుగులు వేయనున్నారు అనేది పక్కా అని స్పష్టత వచ్చేసింది….ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరిరెడ్డి వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు.

Related imageఇప్పటికే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో రెండు సార్లు చర్చలు జరిపారు.. ఈ సమయంలో జగన్ తో లోటస్ పాండ్ లో సోదరుని కుమారుడితో తన అనుచరులతో వెళ్లి కలిసి మాట్లాడారు.. జిల్లా రాజకీయాల గురించి చర్చించారు… అయితే జగన్ ఖరాఖండిగా తెలియచేశారు.. ఆత్మకూరు సీటు విషయంలో మీకు సీటు కావాలి అని నాకు కండిషన్ పెట్టకండి, షరతులు లేకుండా జాయిన్ అవ్వాలి అని జగన్ తెలియచేశారు ఆనం రామనారాయణ రెడ్డికి.

Related image

పార్టీలో మొదటి నుంచి ఉన్న మేకపాటి కుటుంబానికి తాను ద్రోహం చేయలేను.. పార్టీలో తొమ్మిది సంవత్సరాలుగా ఉన్న రిలేషన్ అలాగే గౌతం రెడ్డి జగన్ కు ప్రాణ మిత్రుడు ఇలా సీటును ఆనం ఫ్యామిలీ కోసం వదులుకోలేను అని చెప్పడంతో ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఏ సమాధనం చెప్పలేకపోయారు… కాని పార్టీలో సముచిత స్ధానం ఇస్తామని జగన్ ఆయనకు మాట ఇచ్చారట.. ఆత్మకూరులో వచ్చేఎన్నికల్లో కూడా టికెట్ మేకపాటి గౌతమ్ రెడ్డికే అని తెలియచేశారు జగన్.

Image result for ys jaganmohan reddy

అయితే తన కుటుంబానికి ఏదైనా సపోర్ట్ గా అండగా ఉండాలి అని న్యాయం చేయాలి అని ఆనం కోరారు..అలాగే తన అన్న వివేకానందరెడ్డి మరణంతో ఆయన కుమారుడైన ఆనం రంగమయూర్రెడ్డి కూడా రాజకీయంగా అవకాశం కల్పించాలని రామనారాయణరెడ్డి జగన్ ని కోరారు. ఇక మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి జిల్లాలో అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు ఒకే అని జగన్ హామీ ఇచ్చారట. ఇక కుటుంబ సభ్యులతో చర్చించి ఆయన ఏ రోజున పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వనున్నారు.. ఈ విషయాన్ని ఆయన కేడర్ కు కూడా తెలియచేయనున్నారు.. మరి చూడాలి ఆనం కు ఆత్మకూరు కాకపోతే వెంకటగిరి టికెట్ ఇస్తారేమో అని చర్చలు జరుగుతున్నాయి.