ఆప్ సీనియర్ నేత రాజీనామా… షాక్ లో కేజ్రీవాల్

368

అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ గత డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  అనూహ్య విజయం సాదించి బిజెపికి గట్టి షాక్ ఇచ్చింది..అయితే ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సీనియర్ నేతలు రాజీనామా చేసి వెడలి పోతుండడంతో డిఫెన్స్ లో పడింది కేజ్రీవాల్ పార్టీ..కొన్నాళ్ల క్రితం పార్టీ సీనియర్ నేత వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ విషయం మరవకముందే పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీనియర్‌ నేత అశుతోష్‌ పార్టీకి ఆప్ కి రాజీనామా చేశారు.

వ్యక్తిగత కారణాలతోనే పార్టీ వీడి వెళ్తున్నట్టు అశుతోష్ చెబుతున్నారు..రాజకీయాల్లోకి రాకముందు ఆయన జర్నలిస్ట్ గా పనిచేశారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజీనామా విషయాన్ని అశుతోష్ ట్విట్టర్ లో ప్రకటించారు. ‘ ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుంది. ఆప్ తో నా ప్రయాణం విప్లవాత్మకం, అద్భుతమైనది. దీనికి కూడా ముగింపు ఉంది. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. నా రాజీనామాను అంగీకరించాలని పార్టీని కోరుతున్నా. గత ఎన్నికల్లో ఆయన చాందిని చౌక్ లోక్ సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్ది హర్ష వర్ధన్ చేతిలో ఓడిపోయారు..