గ్రామ వలంటీర్లకు 9 కండిషన్లు 4500 జీతానికి బాబోయ్ అంటున్న ఉద్యోగులు

509

ఏపీలో ఉద్యోగాల జాతర వచ్చిందని చెప్పాలి ఇఫ్పటికే గ్రామ వలంటీర్ల నియామకాలు పూర్తి అయ్యాయి..వలంటీర్ల నియామకాల్లో ఆంక్షలతో కూడిన అంగీకార పత్రాలను అధికారులు తీసుకుంటున్నారు. సంతృప్తికరమైన సేవలందిస్తేనే ప్రతి నెలా గౌరవ వేతనాలు చెల్లిస్తాం అని చెబుతున్నారు. ఇక బయోమెట్రిక్‌ సాధనం కోసం వేతనాల్లో ప్రతి నెలా రూ.500 కట్‌ చేస్తామంటూ కొన్ని మార్గదర్శకాలతో కూడిన అంగీకార పత్రాన్ని ఎంపికైన అభ్యర్థుల నుంచి ఆయా మండల అభివృద్ధి అధికారులు తీసుకుంటున్నారు. అయితే బయోమెట్రిక్ సాధనం కోసం నెలకు 500 కట్ చేయడం ఏమిటి అని కొందరి నుంచి విమర్శలు వస్తున్నాయి.

Image result for jagan

ఏడాదిపాటు మాత్రమే విధుల్లో కొనసాగేవిధంగా వలంటీర్లకు అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. వలంటీర్లకు ఎంపిక ఉత్తర్వులను మండల అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అభ్య ర్థులకు అందజేస్తున్నారు. ఈనియామకాలకు సంబంధించి గ్రామ వలంటీరు ఎంపికపత్రం పేరిట తొమ్మిది నిబంధనలతో కూడిన అంగీకారపత్రాన్ని ఎంపికైన అభ్యర్థి ఆయా మండల అభివృద్ధి అధికారులకు లేదా పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలి. వలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులు అత్యంత అంకితభావంతో సమాజసేవ కలిగివుండి పనిచేయాల్సివుంది. ఎంపికైన అభ్యర్థులు 2020 ఆగస్టు 14వతేదీ వరకు మాత్రమే విధుల్లోకి తీసుకొనబడినదని, ఈలోగాసరైన పనితీరును చూపించకపోయినా, సరైననడవడిక లేకపోయినా, నిర్లక్ష్యంగా బాధ్యతలు నిర్వహించినా, అక్రమాలకు పాల్పడినా సదరు వలంటీరును తక్షణమే విధుల నుంచి తప్పిస్తామని అంగీకారపత్రంలో తెలియచేశారు.

Image result for jagan

సంతృప్తికరమైన సేవలందిస్తేనే నెలకు రూ.5వేల వంతున గౌరవవేతనం చెల్లిస్తామని, బయోమెట్రిక్‌ సాధనం ప్రతి వలంటీరు వద్ద ఉండాలని, దీనికోసం స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌రూపంలో కలిగివుండాలి. లేనిపక్షంలో వాటిని ప్రభుత్వమే సమకూర్చి నెలసరి జీతంలో బయోమెట్రిక్‌ సౌకర్యం కోసం రూ.500వంతున వేతనాల్లో కోత విధిస్తామన్నారు. గ్రామంలోనే స్థిరనివాసముంటూ కేటాయించిన 50 కుటుంబాలకు అంకితభావంతో సేవలందించడానికి సంసిద్ధులై ఉండాలి. గ్రామపంచాయతీ, సచివాలయాలు నిర్వహించే అన్ని కార్యక్రమాల పనులు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి.

ఈ క్రింది వీడియో ని చూడండి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాల ద్వారా అందించవల్సిన లబ్ధిని, సేవలను నీతి, నిజాయితీలతో పారదర్శకంగా ఆయాకుటుంబాలకు చేరవేయడంతోపాటు అర్హులైన కుటుంబాలకు రేషన్‌ పంపిణీ, సామాజిక పింఛన్ల పంపిణీతోపాటు అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ భరోసా, వైఎస్‌ఆర్‌ చేయూత వంటి పథకాల అమలుకు అంకితభావంతో కృషిచేయాలి. ఈతొమ్మిది మార్గదర్శకాలకు అంగీకారం తెలిపే వలంటీర్లు ఆ పత్రంపై సంతకం చేసి పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవోకు అందజేయాల్సివుంది. ఈనెల15 నుంచి విధుల్లో చేరాల్సిందిగా వారికి ఆదేశాలందాయి. మొత్తానికి ఈ 5 వేల జీతానికి 50 కండిషన్లు పెడుతున్నారు అని కొందరు విమర్శలు చేస్తుంటే మరికొందరు ఈ ఉద్యోగాలు కూడా లేని వారు చాలా మంది ఉన్నారు అంటున్నారు, అయితే ముందు ఈ నియామకాలు పూర్తి అయిన తర్వాత గ్రామసచివాలయాల ఉద్యోగులు, గ్రామ వలంటీర్ల పనితీరు ఏ విధంగా ఉందో చూసి. ఆ తర్వాత జగన్ పాలనకు మార్కులు వేస్తామంటున్నారు కొందరు తటస్దులు. మరి చూడాలి జగన్ ఆలోచన కార్యరూపం దాల్చింది రిజల్ట్ ఎలా ఉంటుందో.