బ్రేకింగ్ నిరుద్యోగులకు స్వీట్ న్యూస్ చెప్పిన జగన్

136

ఎక్కడి పరిశ్రమల్లో అక్కడి వారికే 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన బిల్లు ఆమోదించింది. పరిశ్రమలు/కర్మాగారాలు/జాయింట్ వెంచర్‌తోపాటు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టిన వాటన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ‘పరిశ్రమలు/కర్మాగారాల్లో స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాల కల్పన చట్టం – 2019’ను బుధవారం శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వం దీనిపై నోటిఫికేషన్ ఇవ్వగానే… ఈ చట్టం అమలులోకి వస్తుంది. కొత్తగా ఏర్పాటుకాబోయే పరిశ్రమలతోపాటు… ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారు స్థానికంగా లభించకపోతే… ప్రభుత్వంతో కలిసి స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు మూడేళ్లు గడువు ఇస్తారు.

ఈ క్రింద వీడియోని చూడండి

సంబంధిత పరిశ్రమల్లో పని చేసే నైపుణ్యం ఉన్న వారు ఎక్కడా అందుబాటులో లేకపోతే… ఈ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు అందిన రెండు వారాల్లోపు అధికారులు నిశితంగా పరిశీలించి… మినహాయింపు ఇవ్వాలో, వద్దో నిర్ణయించుకుంటారు. ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా ఒక నోడల్ ఏజెన్సీని నియమిస్తారు. నియామకాలపై యాజమాన్యాలు ప్రతి మూడు నెలలకోసారి ఈ ఏజెన్సీకి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీలో ఉద్యోగ/కార్మికులకు సంబంధించిన రికార్డులను పరిశీలించే అధికారం ఈ నోడల్ ఏజెన్సీకి ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన పరిశ్రమలకు జరినామా విధించవచ్చు. ఈ చట్టం అమలుకు సంబంధించిన పూర్తి నిబంధనలను నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తారు. ‘‘పరిశ్రమలు/కర్మాగారాలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం’’ అని ఈ బిల్లులో పేర్కొన్నారు.

Image result for jagan

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పన చట్టం, పీపీఏల సమీక్షపై ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తచట్టం మూలంగా పరిశ్రమలు రావని, దానివల్ల ఉద్యోగాలు కూడా రావని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పీపీఏల్లో విద్యుత్ కొనుగోలు రేట్లు తగ్గించడం ద్వారా మరింత తక్కువ ధరకే పరిశ్రమలకు విద్యుత్ అందుతుందని, ఇది పూర్తిగా పరిశ్రమలకు అనుకూల నిర్ణయమని పేర్కొన్నారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం కల్పించిందని, వారి బాధలు తీర్చేవిధంగా కొత్త చట్టానికి రూపకల్పన చేశామని తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సీఎం వెల్లడించారు. పరిశ్రమల్లో ఉద్యోగులకు కావాల్సిన నైపుణ్యాన్ని ఈ సెంటర్లలో శిక్షణ ద్వారా అందిస్తామని తెలిపారు. చట్టప్రకారం స్థానికులకు వెంటనే ఉద్యోగాలు కల్పించకపోతే మూడేళ్ల కాలపరిమితిలో కల్పించే వెసులుబాటు చట్టంలో ఉందని జగన్ వివరించారు.

Image result for jagan

పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి గౌతమ్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత పేద రైతుల నుంచి కంపెనీలు భూములు తీసుకొని ఎంతోకొంత పరిహారం ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఆ పరిశ్రమల్లో భూములిచ్చిన రైతుల ఇంట్లోని ఏ ఒక్కరికీ ఉద్యోగాలు రావడం లేదు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియ కార్ల కంపెనీలో కిందిస్థాయిలో చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే స్థానికులకు ఇచ్చారు. అదేగనుక తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉంటే వారికి పెద్ద ఉద్యోగాలు వచ్చేవి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ ఈ చట్టం తెచ్చారు’’ అని వివరించారు.

Image result for jagan

ఏదైనా పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు రాష్ట్రంలో లేనిపక్షంలో ఆ కంపెనీలకు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన నుంచి మినహాయింపు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కాగా, పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించడం గొప్ప నిర్ణయమని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకొన్నదని వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని నాడు విస్తృతంగా ప్రచారం చేశారని, కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కుమారుడు లోకేశ్‌కు తప్ప ఇతరులెవరికీ ఉద్యోగం రాలేదని ఆరోపించారు.