29 న ఉండవల్లి కీలక సమావేశం

263

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమి చేసినా సంచలనమే…ఆయన రాజకీయ పార్టీలలో ఇప్పుడు లేకపోయినా ప్రతీ అంశం పై తన వాగ్దాటి చూపుతారు ..ప్రతీ పథకం గురించి ప్రణాళికల గురించి అందులో ఉన్న లోటుపాటులు గురించి ఉండవల్లి లెక్కలతో సహా బయటపెడతారు. తాజాగా ఆయన ఈనెల 29న విజయవాడలో రాజకీయపార్టీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు

Image result for undavalli arun kumar
ఏపీకి జరిగిన అన్యాయంపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి ఏడు రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, అయితే సమావేశానికి హాజరయ్యేందుకు వైసీపీ అంగీకరించలేదని ఆయన చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ఇక ఉమ్మడి కార్యాచరణ చేసి ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఆలోచిస్తాము అని చెప్పారు ఉండవల్లి.