27 న కొణతాల రైలుయాత్ర

201

ఆంధ్రప్రజల జనఘోషను ఢిల్లీలో వినిపించేందుకు ఈనెల 27న ‘జనఘోష రైలు యాత్ర’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్రా సమస్యలను ఏ పార్టీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి ఉదయం ఏపీ ఎక్స్ప్రెస్లో ఉత్తరాంధ్ర వేదిక బృందం బయలుదేరుతుందన్నారు.

Image result for మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ

ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అంతకన్నా ముందే అక్కడికి చేరుకుని రాష్ట్ర ప్రజల సమస్యలను వివిధ పక్షాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ రైలు యాత్రను తలపెట్టినట్లు రామకృష్ణ స్పష్టం చేశారు. ఐదు రోజుల పాటు ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ యాత్రకు రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. మొత్తానికి ఏపీ ప్రజలు సమస్యలు ఉత్తరాంధ్రా సమస్యలపై కొణతాల పోరాటం పై అక్కడ వారు ముఖ్యంగా ఉత్తరాంధ్రా నాయకులు ఆయనని అభినందిస్తున్నారు.