25 వేల మందితో బాబు భేటీ సర్వత్రా ఆసక్తి

182

ఏపీలో డేటా చోరి అనే అంశం కాక రేపుతోంది… ఓ పక్క డేటా చోరి అంతా తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర ఉండి మరీ చేయించింది అని అభియోగాలు మోపుతున్నారు వైసీపీ నేతలు.. తెలంగాణలో ఫిర్యాదు ఇచ్చి కావాలనే ఇలాంటి అభియోగాలు ఏపీపై మోపి , తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.

Related image

త్వరలో 25వేల మంది సేవామిత్రలతో భేటీ అవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పలువురు టీడీపీ నేతలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సేవామిత్రలను మంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాదేనన్నారు. అన్ని కులాల వారితో అన్నదమ్ములుగా మెలగాలని, సామాజిక న్యాయమే తెలుగుదేశం సిద్ధాంతమన్నారు. కొందరు కావాలి అని కుట్ర పన్నుతున్నారు వాటిని తిప్పుకొటాలి అని పిలుపునిచ్చారు ఎన్నికల వేళ చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేశారు.కుల రాజకీయాలకు పాల్పడితే ప్రజలే గుణపాఠం చెబుతారని, ‘కష్టపడే వారందరికీ గుర్తింపు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది..పార్టీని గెలిపించే పూచి మీదే అని బూత్ కన్వీనర్లతో చంద్రబాబు అన్నారు.సో ఈ భేటీ పై తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ నెలకొంది.