2019 లో జగనే సిఎం..”30 ఇయర్స్ ఇండస్ట్రీ” జోస్యం…

628

మడమ తిప్పని మాట తప్పని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో ఆయన తనయుడు వైస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే..ఆయన చేపడుతున్న వేలాది కిలో మీటర్ల పాదయాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారు..జగన్ కు వస్తున్నా ప్రజాదరణ చూసి కొందరు కీలక నేతలు వైసిపి లోకి చేరుతున్నారు..మరో వైపు కొందరు సినీ ప్రముఖులు కూడా జగన్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు..కొద్ది రోజుల క్రిందట పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్రలో ప్రముఖ సినీ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి, స్టార్ కమెడియన్ పృథ్వి లు జగన్ ను కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేసారు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ మరోసారి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలన్నీ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పృథ్వీ జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఆప్ తరహాలో వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు..2019 ఎన్నికల్లో వైసీపీదే గెలుపని – జగన్ సీఎం అవుతారని – కావాలంటే ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చని పృథ్వి బల్లగుద్ది మరీ చెప్పారు. జగన్ పై వస్తోన్న విమర్శలన్నీ నిజం కాదని…వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తేదని అన్నారు. జగన్ ను తాను దగ్గర నుంచి చూశానని – ఆయన మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో జగన్ కు వస్తోన్న ప్రజాదరణ చూసి…మొత్తం ప్రభుత్వం రంగంలోకి దిగి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారని టీడీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు..

. అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ ను కలిసినపుడు కూడా పృథ్వి వైసీపీ కి మద్దతు తెలిపిన విషయం విదితమే. వైసీపీ కండువా మెడలో వేసుకొని….వైసీపీ జెండా భుజాన మోస్తూ జగన్ అడుగులో అడుగేసుకుంటూ పృథ్వీ….జననేత వెంబడి నడిచారు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడని – వైఎస్ తర్వాత జననేత జగన్ కు మాత్రమే ఈ తరహా పాదయాత్ర సాధ్యమని అన్నారు. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగిపోయిందంటే జగన్ కు ఏ స్థాయిలో జనాదరణ వస్తోందో అర్ధమవుతోందన్నారు. తనకు తెలిసిన మహాయోధులు ఎన్టీఆర్ – వైఎస్ ఆర్ మాత్రమేనని – తాను చూసిన గొప్ప ముఖ్యమంత్రులు వారిద్దరేనని అన్నారు. వారి తర్వాత అంతటి ఘనత జగన్ కే సాధ్యమని ప్రశంసలతో ముంచెత్తారు.