2014 లో పవన్ పోటీ చేయకపోవడానికి చిరంజీవి కారణమట..షాకయ్యారా..!

552

2014 లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి బిజెపి కూటమికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే..అయితే జనసేన పోటీ చేయకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవక తప్పదు…తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి చెప్పారట, పోటీ చేయొద్దని. ‘ఓటు బ్యాంకు చీలిపోతుంది.. అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కలిసొస్తుంది. కావాలంటే, రాజ్యసభ సీట్లు ఇస్తాం..’ అని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ముందు బంపర్‌ ఆఫర్‌ పెట్టారట. ‘ఓట్లు చీలిపోతాయా.? ఏమో, నిజమేనేమో..’ అని భావించి, రాజ్యసభ సీటుపై కాస్త ఆలోచనలో పడి పోటీ నుంచి తప్పుకున్నారట పవన్‌కళ్యాణ్‌. ఇదీ అసలు కథ.!

పవన్ కళ్యాన్ స్వయంగా ఈ విషయం చెప్పారు కాబట్టి నిజమే…కానీ ఆ రాజ్యసభ సీటు ఎవరి కోసమో తెలుసా..స్వయానా అన్న చిరంజీవి కోసమట..అప్పటి వరకు కాంగ్రెస్ మద్దతు తో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న చిరంజీవి పదవీకాలం పూర్తవడంతో మళ్ళీ రాజ్యసబహలో కొనసాగాలని కోరుకుంటుండగా తమ్ముడి ద్వారా అది నెరవేర్చుకోవాలని బిజెపి నాయకుల మాటల బట్టి తెలుస్తోంది..

చిరంజీవి కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ తనను రాజ్యసభకు తిరిగి పంపించి ఉండేది..అంతెందుకు చంద్రబాబు ను అడిగితె రాజ్యసభకు పంపించారా..లేదూ అనుకుంటే బిజెపి లో చేరితే రాజ్యసభ సభ్యత్వం పెద్ద విషయమేమీ కాదు..అప్పుడున్న ఓటు బ్యాంకు రాజకీయాల నేపధ్యంలో ఇవేవీ చిరంజీవికి కష్టం కాదు..కానీ, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యల ద్వారా, బీజేపీ.. చిరంజీవిని ఇరకాటంలోకి లాగేసింది. కాదు కాదు, తన వ్యాఖ్యల ద్వారా చిరంజీవిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేశారు పవన్‌కళ్యాణ్‌?

నిజానికి, గతంలోనే బీజేపీ నుంచి చిరంజీవి రాజ్యసభకు వెళతారన్న ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తదేనని ఆ తర్వాత చిరంజీవి కాంపౌండ్‌ కొట్టి పారేసిందనుకోండి.. అది వేరే విషయం. రాజకీయాలకు దూరంగా వుంటే, ఎంచక్కా సినీ పరిశ్రమలో తన పని తాను చేసుకుపోతున్న చిరంజీవి, మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి లాగబడ్డారు. మరి, తనపై వస్తున్న ఆరోపణలపై చిరంజీవి పెదవి విప్పుతారా.? వేచి చూడాల్సిందే.

అన్నట్టు, ఓ రాజకీయ పార్టీ స్థాపించిన వ్యక్తికి.. జనాన్ని ఉద్ధరించేద్దామనే ఆలోచన వున్న ఆవేశపరుడికి.. ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాల్లో నాలుగేళ్ళు టైమ్‌పాస్‌ చేయాల్సిన అవసరమేంటి.? మళ్ళీ ఇప్పుడు ఎన్నికల వాతావరణం నేపథ్యంలో రాజకీయ హడావిడి ఎందుకు.? అప్పుడు చంద్రబాబు వద్దన్నారని ఎన్నికల్లో పోటీ చేయలదట.. ఈసారి నరేంద్రమోడీ వద్దని చెబితే, జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వుంటుందా.? రాను రాను తన వ్యాఖ్యలతో పవన్‌కళ్యాణ్‌ తన విశ్వసనీయతనే దెబ్బతీసేసుకుంటున్నారు.