12 కు జగన్ కేసు విచారణ వాయిదా

266

విశాఖలో జగన్ పై జరిగిన కత్తిదాడి కేసుపై విచారణ ను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణపై గతంలోనే రాష్ట్రప్రభుత్వం సిట్ ఫైల్ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. దీంతో బుధవారం ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం ఈ మేరకు వాయిదా వేసింది. నేడు ఈ కేసుపై విచారణ జరిగింది ఇక ఏ మెటిరియల్ లో ఎన్ ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలి అని హైకోర్టు ఆదేశించడంతో . కేంద్రం తరపు న్యాయవాది పూర్తి వివరాలతో కోర్టుకు హాజరయ్యారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సిట్ తరపు లాయర్ వారం రోజుల సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.