శెట్టిబ‌లిజ‌ల‌కు జ‌గ‌న్ మ‌రో హామీ

430

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పాద‌యాత్ర‌లో ఇప్ప‌టికే ప‌లువురు త‌మకు ఉన్న స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు.. ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌పై అర్జీలు పెట్టుకుంటున్నారు.. ముఖ్యంగా ప్ర‌త్యేక కార్పొరేష‌న్ కావాలి అని ప‌లు క‌మ్యూనిటీల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ‌ను గుర్తించాలి అని వారు కోరుతున్నారు.

Image result for padayatra jagan

రాష్ట్రంలోని శెట్టి బలిజ సామాజిక వర్గానికి, ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారికి తోడుగా ఉంటామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ వర్గానికి హామీ ఇచ్చారు… ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 303వ రోజున విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించారు. అల్లువాడ వద్ద శెట్టి బలిజ సామాజిక వర్గం వారు పెద్ద సంఖ్యలో జననేతను కలిసి సంఘీభావం తెలిపారు. మరోవైపు వారి సమస్యలనూ వివరించారు. తమ కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, తగినంత మేర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

Image result for padayatra jagan

రాష్ట్రంలో తమ కులంలో చాలా మంది పేదలున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని విన్నవించారు. వారి సమస్యలను ఓపికగా విన్న జననేత.. దేవుడి దయవల్ల, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయబోయే విప్లవాత్మక మార్పుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటిది…ప్రతి బీసీ కుటుంబానికీ లబ్ధి కలుగుతుంది మీ అంద‌రి స‌మ‌స్య‌లు తీర‌తాయి అని న‌మ్మ‌కంగా ఉండండి అని తెలియ‌చేశార‌ట జ‌గ‌న్..

Image result for padayatra jagan

నేను ఇదివరకే ప్రకటించిన విధంగా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ను తెస్తాం. అందులో కచ్చితంగా శెట్టిబలిజలకు కూడా ఓ కార్పొరేషన్‌ ఉంటుంది. దాని గురించి ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరమే లేదు. మీకు ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిరిగా నేను అంతిస్తా.. ఇంతిస్తా.. అని చెప్పి మోసం చేయడం నాకు నచ్చని పని. నాకు అలా చేయడం చేతకాదు. మనం చేయబోయే మరో విప్లవాత్మకమైన మార్పు అని జ‌గ‌న్ తెలియ‌చేశారు. దీంతో వారు కూడా ఆనందంగా వెనుతిరిగారు అని అక్క‌డ పార్టీ నేత‌లు చెబుతున్నారు.