వై.ఎస్. డెత్‌ మిస్టరీ : హెలికాప్టర్ కాక్‌ఫిట్ వాయిస్ రికార్డర్ ఏం చెప్పింది..?

104

వై.ఎస్. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు..అయితే సరిగ్గా హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది.. హెలికాప్టర్ ఎలా ప్రమాదానికి గురైంది.. ఇలాంటి విషయాలను వివరించే కాక్ పిట్ రికార్డర్ ఏం చెప్పింది.. అనేది ఆసక్తికరం. హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో ఇలాంటి కాక్ పిట్ వాయిస్ రికార్డర్లే అసలు గుట్టు విప్పుతాయి. ఇప్పుడు వైఎస్ మరణ రహస్యాన్ని కూడా ఈ కాక్ పిట్ వాయిస్ రికార్డరే బయటపెట్టింది. ఏమని బయటపెట్టిందో ఇప్పుడు చూద్దాం.

Image result for హెలికాప్టర్ కాక్‌ఫిట్ వాయిస్ రికార్డర్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు చాలా గాలింపులు చేపట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆచూకీ కోసం భారతదేశంలోనే అంతవరకు ఎన్నడూ జరగనంత అతి పెద్ద ఆపరేషన్ ను కర్నూలు జిల్లా ఆత్మకూరులో నిర్వహించారు. ఇది దేశ చరిత్రలోనే ఆది అతిపెద్ద గాలింపుగా చెబుతారు. దాదాపుగా 30 గంటల పాటు వైఎస్‌ఆర్ ఆచూకీ కోసం నల్లమల ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. దాదాపు 24 గంటల తరువాత ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ శకలాలను, 27 గంటల తరువాత ముఖ్య మంత్రి వైఎస్‌ఆర్ మృతదేహాన్ని గుర్తించారు. భారత సైన్యానికి చెందిన 11హెలికాప్టర్లు, కేంద్ర బలగాలు, అత్యంత ఆధునిక పరిజ్ఞానం కలిగిన సుఖోయ్ విమానం, నావికా దళం, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు, నల్లమల అడవుల్లోని గిరిజనులు వేలాదిగా వైఎస్‌ఆర్ ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు. ఇరవైనాలుగు గంటల పాటు ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి లేని పరిస్థితి వైఎస్ మరణంతో ఏర్పడింది. 24 గంటల వెతుకులాట తర్వాత అయన హెలికాఫ్టర్ ఆచూకీ లభించింది.

ఈ క్రింద వీడియో చూడండి

వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్ కాక్‌ఫీట్ వాయిస్ రికార్డర్ విశ్లేషణను ఆ తరువాత అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి సేకరించిన హెలికాప్టర్ శకలాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఢిల్లీకి తరలించారు. వాటిని డీజీసీఏ అధికారులు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ను విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. ఏటీసీ పరిధిలో ఎగురుతోంది. 9.22 నిమిషాల నుంచి 9.30 వరకు హెలికాప్టర్ పైలెట్లు తమకు దారి కనిపించడం లేదని, సరైన దారి చూపించమని పదేపదే చెన్నై ఏటీసీ అధికారులను బతిమాలుకున్నట్లు కాక్‌పీట్ వాయిస్ రికార్డర్ ద్వారా వెల్లడైనట్లు కొంతమంది అధికారులు మీడియాకు తెలిపారు. సరిగ్గా 9.30 గంటల తర్వాత సంభాషణ ఆగిపోయినట్లుగా సమాచారం. సంభాషణ మొత్తం హిందీలో జరిగినట్లు ప్రచారం సాగింది. వై.ఎస్. హెలికాప్టర్ ప్రమాదంపై నాలుగు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. కేసును చట్టపరంగా సీబీసీఐడీ దర్యాప్తు చేసింది. ఇక సాంకేతిక లోపాలపై డీజీసీఏ పరిశోధించింది. దేశ భద్రతలో కీలకమైన రాడార్ కేంద్రాల వారిని ప్రశ్నించే అధికారం సీబీఐకి మాత్రమే ఉండడంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ మూడింటికి తోడు ఇద్దరు నిపుణులతో కూడిన కమిటీని కూడా నియమించారు. చివరకు వైఎస్ మరణం హెలికాప్టర్ ప్రమాదం కారణంగానే జరిగిందని కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా తేల్చారు. మరి వైఎస్ మరణ రహస్యాన్ని బయటపెట్టిన వాయిస్ రికార్డర్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.