వైసీపీ కీలక నేత అరెస్ట్

210

విజయనగరం జిల్లాలో వైసీపీ కీలక నేత అరెస్ట్ కావడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపింది.. విజయనగరం జిల్లా వైసీపీ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు నినాదాలు చేస్తున్నారు..జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో ఓటర్ల జాబితా సర్వే చేస్తున్నారంటూ ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులపై వైసీపీ నేతలు దాడికి దిగారు.

వారి నుంచి ట్యాబ్లు లాక్కున్నారు. దీంతో సర్వే ఏజెన్సీ వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ట్యాబ్లను అప్పగించాలని మజ్జి శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కావాలనే తమపై దాడి చేశారు అని, ఏజెన్సీ వారు అంటుంటే… తమ నాయకుడిపై అన్యాయంగా కేసు పెట్టారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.