వైసీపీ కి ఎంపీ ముర‌ళిమోహ‌న్ చుర‌క‌లు

339

వైసీపీ పై నిత్యం విమ‌ర్శ‌లు చేసే తెలుగుదేశం నాయ‌కుల దారి ఒక‌టి అయితే, అవ‌స‌రానికి అనుగుణంగా కామెంట్లు చేస్తారు తెలుగుదేశం రాజ‌మండ్రి ఎంపీ మాగంటి ముర‌ళిమోహ‌న్ … తాజాగా వైసీపీపై టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు…. జగన్ పార్టీ పేరు కోడి కత్తి పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. జగన్‌ను చూసి కోళ్లు కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. జ‌గ‌న్ తండ్రి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ల‌క్షకోట్లు దోచుకున్నాడు అని సుమారు 18 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జ‌గ‌న్ నీతులు చెబుతున్నారు అని విమ‌ర్శించారు ముర‌ళీమోన్.

Image result for mp murali krishna

16 నెల‌లు జైలులో ఉండి వ‌చ్చిన జ‌గ‌న్ ఎవ‌రిపై అభాండాలు వేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు..ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ప్రజలే ఆలోచించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి.. ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌తో జత కలిశామని వివరించారు. ఏపీలో కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందో లేదోనన్న విషయం మరికొద్ది రోజుల్లో స్పష్టం అవుతుందన్నారు. ఇక జ‌గన్ ని మాత్రం ఏపీలో జ‌నాలు ఎవ‌రూ న‌మ్మ‌రు అని ఆయ‌న విమ‌ర్శించారు.