వైసీపీ అవినీతి మొదలయ్యిందా.. ఆ 450 కోట్లు ఏమయ్యాయ్ ఇరకాటంలో జగన్

761

రాజకీయం అంటేనే ఇచ్చిన హమీలు నిలబెట్టుకోవడం లేదా వాటిని తుంగలోకి తొక్కడం… సో ఇలాంటి రాజకీయాలు ఇప్పటి వరకూ చూశాం, కాని వైసీపీ అధినేత వైయస్ జగన్, సీఎం అయ్యారు ఆయన మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నాం అని చెబుతున్నారు.. పైగా మంత్రి వర్గం కూడా కమిట్మెంట్ తో పనిచేస్తోంది అని చెబుతున్నారు.. ఎక్కడా ఎలాంటి అవినీతి లేకుండా తాము పరిపాలన చేస్తున్నాము అని చెబుతున్నారు.. అయితే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది .. వారు మాత్రం వైసీపీ చేసే ప్రతీ పనిలో తప్పులు వెతికి తీస్తున్నారు.

Image result for jagan

టీడీపీ జగన్ ని టార్గెట్ చేస్తోంది. అంతేకాదు జగన్ కు పాలన చేతకాదు అని పెద్ద పెద్ద కామెంట్లు ఆరోపణలు విమర్శలు విసురుతున్నారు…పైకి ఏమో సున్నితంగా మాట్లాడుతారు కానీ లోలోపల మాత్రం చెయ్యాల్సిన ఘన కార్యాలు అన్ని యథేచ్ఛగా ఓ ప్లానింగ్ ప్రకారం జరిగిపోతుంటాయి.అలాంటి రాజకీయ నాయకుల పాత్రలను సినిమాల్లో ఎంత చక్కగా చూపిస్తారో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది.. ఎందుకంటే ఏపీలోని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకున్న ఎన్నో నిర్ణయాలపై అనేక విమర్శలు వచ్చాయి. దానికి వైసీపీ కూడా సరైన కౌంటర్లు ఇచ్చింది.

ఈ క్రింద వీడియో చూడండి

అంతకు మునుపు నుంచే వైసీపీ పై జగన్ పై ఏ స్థాయి అవినీతి మరకలు ఉన్నాయో కూడా అందరికి తెలుసు.అయితే ఆయన జైలులో ఉన్నా సరే కేసులు నిరూపితం కాలేదని కొంత మంది అభిమానులు చెప్పుకున్నా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా అవినీతి చేసి తీరుతారని మాట్లాడి కూడా ఓట్లు వేసే మనుషులు కూడా ఉన్నారు.అయితే ఆ మధ్య అంతా వైసీపీ ఇచ్చే ప్రభుత్వ బియ్యానికి సంబంధించిన రైస్ ప్యాకెట్ కవర్లకే మొత్తం 750 కోట్లు ఖర్చు చేసారని సోషల్ మీడియా అంతా మారుమోగింది.కానీ అదంతా పచ్చి అబద్దం అని వైసీపీ నేతలు ఖండిస్తూ దానికి కేవలం 300 కోట్లు మాత్రమే తాము ఖర్చు చేశామని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నారు.కానీ ఆంధ్ర రాష్ట్ర అధికారిక ఫైనాన్స్ వెబ్ సైట్ ను కానీ తనిఖీ చేసినట్టయితే అందులో 2019 మరియు 2020 బడ్జెట్ ప్రకారం ఒక్క ఈ రైస్ ప్యాకెట్ల కవర్లకు 93 వ సంఖ్యలో 750 కోట్లు కేటాయించామని తెలిపారు.కానీ వైసీపీ వారు చెప్పింది మాత్రం 300 కోట్లు అంటే అక్షరాలా 450 కోట్లు ఎటు పోయాయో తెలీదు.

Image result for jagan

వీటికి ఎవరు భాద్యులు?అని సోషల్ మీడియాలో సాక్ష్యాలు చూపించి మరియు నెటిజన్స్ వైసీపీను ప్రశ్నిస్తున్నారు.దీనిని బట్టి ఇక ఏపీలో వైసీపీ అవినీతి మొదలయ్యిందా అని మరికొంత మంది అంటున్నారు…మరి ఈ 450 కోట్లకు వైసీపీ సమాధానం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.అయినా 450 కోట్లు అంటే తక్కువేమి కాదు దీనికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది రాజకీయాల్లో ఉన్న వారు పైగా ప్రభుత్వంలో ఉన్న మంత్రి సదరు అధికారులు సమాధానం చెప్పాలి అని తెలుగుదేశం నేతలు కోరుతున్నారు.. చూడాలి దీనిపై జగన్ సర్కారు ఎలాంటి సమాధానం చెబుతుందో.