వైసీపీ అభ్యర్దులపై పాల్ కొత్త అస్త్రం

249

ఎన్నికల సమయంలో చేసే ఫీట్లు మాములు విషయం కాదు, ముఖ్యంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్దులు నామినేషన్ వేయడం తెలిసిందే.. ఒకే పేరు ఉండే వ్యక్తులతో ప్రత్యర్ది పార్టీలు తమపై పోటీ చేసే వారి ఓట్లు చీల్చేందుకు వారిని నిలబెడతారు..ప్రకాశం జిల్లాలోనూ అదే జరిగింది. పర్చూరు నియోజకవర్గంనుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేస్తున్నారు. ఆయన విజయావకాశాలను దెబ్బకొట్టేందుకు పెద్ద కుట్ర పన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు పేరుతోనే వున్న ఒంగోలు సమీపంలోని పెళ్లకూరుకు చెందిన ఒక వ్యక్తిని ప్రజాశాంతి పార్టీ పర్చూరునుంచి పోటీ చేయిస్తోంది. గుంటూరు జిల్లాలోనూ అదే జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నంబూరు శంకరరావు పోటీ చేస్తున్నారు. దాదాపు అదే పేరుతో వున్న నంబూరి శంకరరావును ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థిగా నిల్చోబెట్టి… ఓటర్లను గందరగోళ పరిచే ఎత్తుగడకు పూనుకుంది. కావాలనే తెలుగుదేశం పార్టీ అలాగే ప్రజాశాంతి పార్టీలు ఇటువంటి కుట్ర చేస్తున్నాయి అని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు