వైసీపీలో చేరిన మైనార్టీ కీల‌క నేత‌

367

గుంటూరు జిల్లాలో వైసీపీ మంచి జోష్ మీద ఉంది అనేచెప్పాలి ఓ ప‌క్క‌సెగ్మెంట్లో ప‌లువురునేత‌ల‌ను మారుస్తూ ముందుకు వెళుతూ విజ‌యం కోసం రాజ‌కీయ ఎత్తులు వేస్తున్న జ‌గ‌న్ తాజాగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు ఈ జిల్లాలో తీసుకుంటున్నారు గుంటూరు మండల కేంద్రమైన బెల్లంకొండ టీడీపీ ఎంపీటీసీ పీఎస్‌కే అబ్దుల్‌ వాహబ్‌, ఆయన సోదరుడు పీఎస్‌కే రసూల్‌ ఆదివారం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన వాహబ్‌, రసూల్‌ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వాహబ్‌ టీడీపీ నుంచి పోటీ చేసి 831 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీలో సముచిత స్థానం కల్పించడం లేదని కొంతకాలంగా వాహబ్‌ అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి నంబూరు శంకరరావు, సీనియర్‌ నేత చెన్నప్పరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కంచేటి సాయి, కంచేటి సాయికుమార్‌, నరేంద్ర చౌదరి, మరికొంతమంది వైసీపీ నాయకులు ఎంపీటీసీ వాహబ్‌ చేరికను స్వాగతించారు.