వైసీపీలో చేరిన టీడీపీ సీనియ‌ర్

378

కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ త‌న దూకుడు చూపిస్తోంది… పార్టీ త‌ర‌పున గెలుపు ఈసారి సులువు అనేలా నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు..ఈ చేరిక‌లతో పార్టీ త‌ర‌పున జోష్ అయితే క‌నిపిస్తోంది..తాజాగా నందిగామ‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.మారేష్‌ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఐదవరం గ్రామంలోని మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ నివాసంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.

Image result for ycp

పార్టీ అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండి తోక జగన్‌మోహన్‌రావు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, సామినేని ఉదయ భాను, డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆయ‌న చేరిక‌తో స్ధానికంగా పార్టీకి మ‌రింత బ‌లం పెరుగుతుంది అని తెలియ‌చేశార‌ట‌.