వైసీపీలో చేరిన అలీ జగన్ కొత్త వర్క్

154

సినీ హాస్యనటుడు అలీ వైసీపీ గూటికి చేరారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్తో భేటీ అయిన అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎంతో కాలంగా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన , చివరికి వైసీపీలో చేరారు. ఇక జగన్ మాత్రం ఆయనని ఎక్కడ కావాలి అంటే అక్కడ పోటీ చేయమని కోరారు అని గతంలో వార్తలు వచ్చాయి .అయితే పాదయాత్రలోనే చాలా మంది నాయకులకు టికెట్ అనౌన్స్ చేశాను, ఇప్పుడు టికెట్ ఇవ్వడం కుదరదు అని జగన్ తెలియచేశారట అలీకి. దీంతో అలీ కూడా నేను పార్టీలో చేరుతా మీరు నాకు రాజకీయంగా మంచి భవిష్యత్తు చూపించాలి అని కోరారు దీనికి జగన్ సమ్మతించారు అని అందుకే ఆయన వైసీపీలో చేరారు అని తెలుస్తోంది.

Image result for ali join ysrcp
గతంలో ఏ పార్టీలో చేరినా మంత్రి పదవి ఇస్తాము అంటేనే చేరుతా అన్నారు, మరి వైసీపీలో మంత్రి పదవి ఇస్తారా అని అడిగితే, ఇప్పుడు జగన్ నుంచి హామీ లేదు. కాని ఆయన నా రాజకీయ భవిష్యత్తు చూసుకుంటాను అని అన్నారు అని చెప్పారు అలీ, అయితే వైసీపీలో తనకు పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం లేదని ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ,కేవలం వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నాను అని అలీ తెలియచేశారు.. సో మొత్తానికి అలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా తీసుకుంటాను అని జగన్ హమీ ఇచ్చారని. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కొందరు నేతలు పార్టీలో అసమ్మతి వర్గంగా మారుతారు అని అందుకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదని తెలియచేశారట జగన్. మరి అలీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చూడాలి.