వైసీపీలో ఇంచార్జ్ పై కంప్లైంట్

298

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుపుకోసం ఇప్ప‌టికే ప‌లు దారులు వెతుకుతున్నారు అందులో భాగంగా గెలుపు గుర్రాల‌కు మ‌త్ర‌మే టికెట్ ఇచ్చే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నారు.. అందుకే ప‌లుచోట్ల ఇంచార్జుల‌ను మారుస్తున్నారు..ఇటీవల తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన డాక్టర్‌ శ్రీదేవిపై నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Image result for jagan

ఆమె వైఖరిపై నియోజకవర్గ పరిధిలోని తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలా లకు చెందిన కొందరు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్య‌తిరేకిస్తున్నారు….పార్టీకోసం ఇంత‌కాలం క‌ష్ట‌ప‌డిన వారిని ప‌క్క‌న పెట్టి కొత్త‌వారిని త‌న చుట్టు పెట్టుకుంటున్నారు అని.. ఆమె చుట్టు కొంద‌రు కోట‌రిగా ఏర్పడి ఉన్నారు అని విమ‌ర్శిస్తున్నారు.. త‌మ‌ని నేరుగా వెళ్లి క‌లిసే అవ‌కాశం లేకుండా చేశారు అని అంటున్నారు ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తూ స్ధానిక కేడ‌ర్.