వైసీపీలోకి రమేష్ కుమార్

360

జగన్ పాదయాత్ర మరో24 గంటల్లో ముగియనుంది.. ఈ సమయంలో పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల చేరికలు ఉంటాయి అని వార్తలు వస్తున్నాయి తాజాగా ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు కూడా పార్టీలో చేరుతారు అని తెలుస్తోంది.మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కుమారుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

వైసీపీ తరఫున శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని విజయి సాయిరెడ్డిని కలిసి ఆయన కోరినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరాలని, తరువాత టిక్కెట్ ఆలోచిద్దామని చెప్పినట్టు వినికిడి. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని రమేష్కుమార్ కలిశారు. 9వ తేదీ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా పార్టీలో చేరేందుకు ముహుర్తం నిర్ణయించినట్టు తెలిపారు. ఇక ఆయనకు కూడా పార్టీలో సముచిత స్ధానం ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.