వైసీపీకి జై కొట్టండి ఫృద్వీరాజ్ పిలుపు

80

వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా న‌టుల నుంచి ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది.. ముఖ్యంగా వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌పోర్ట్ సినిమా ఇండ‌స్ట్రీ నుంచి మరింత పెరుగుతుంది అని తెలుస్తోంది.. ఇప్ప‌టికే క‌మెడియ‌న్ పృధ్వీరాజ్ కూడా జ‌గ‌న్ కు స‌పోర్ట్ చేశారు.. తాను జ‌గ‌న్ వెంటే ఉంటాన‌ని జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో క‌లిసి ఆయ‌న‌తో నాలుగు అడుగులు న‌డిచారు. తాజాగా వైసీపీ గెలుపే లక్ష్యంగా ప‌నిచేయాలి అని ఆయ‌న అన్నారు.రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సినీనటుడు పృధ్వీరాజ్‌ అన్నారు.

Image result for comedian prudhvi raj with jagan

వైసీపీ బలోపేతానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని కేదారేశ్వరపేట, ఖుద్దూస్‌ నగర్‌లో నిర్వహించారు. కార్పొరేటర్‌ బుల్లా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పృధ్విరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పలు వీధుల్లో ప్రచారం చేశారు..

Related image

ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలనకు ముగింపు పలికేందుకు, వైసీపీ నాయకులంతా ఉత్సాహంగా పనిచేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యం తీసుకురావాలన్నారు.. వైఎస్‌ స్వర్ణయుగం రావాలంటే జగన్‌తోనే సాధ్యం అన్నారు. వెలంపల్లి మాట్లాడుతూ రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి వివరిస్తున్నామన్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చారు, ఈ కార్య‌క్రమానికి ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి కూడా హాజ‌ర‌య్యారు ఇక మ‌ల్లాది విష్ణుకూడా వీరితో క‌లిసి ప్ర‌చారం చేశారు.