వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతిల పెళ్లిరోజు షర్మిల ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలు

216

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతిల పెళ్లిరోజు. ఈ సందర్భంగా సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పెషల్ విషెస్ తెలిపారు. పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఓ ఫోటోను తన ఫేస్బుక్ పోస్ట్లో షేర్ చేశారు. ‘హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నయ్యా, వదినమ్మా’అంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల ఫేస్బుక్ పోస్ట్తో జగన్ పెళ్లిరోజని తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. షర్మిల షేర్ చేసిన ఫోటోను చూసి మురిసిపోతున్నారు. షర్మిల షేర్ చేసిన జగన్, భారతిల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. మొత్తానికి షర్మిల అరుదైన ఫోటోతో తన అన్నా,వదినలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతిలకు పెళ్లిరోజు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే షర్మిల కూడా వారిద్దరికి కూడా పెళ్లినాటి ఫోటోతో కూడాని ఫ్రేమ్ ని ఇవ్వడం జరిగిందట.

ఈ క్రింద వీడియో చూడండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు అందరు జగన్ దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను వారి వారి ఫేస్బుక్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగన్ కి, రాముడులాంటి జగనన్న భర్తగా దొరికినందుకు భారతి గారికి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. వారిరువురు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని మనసారా కోరుకుంటన్నాము అని జగన్ పై తన అభిమానాన్నిచాటుకుంటూ దేవుళ్లతో జగన్, భారతిలను పోల్చుతు పెళ్లిరోజు ఫొటోలను పెట్టి విషెస్ చెబుతున్న పోస్ట్ లు ప్రస్తుతం వైరల్ అవుతోంది. జగన్ దంపతులు 23 వసంతాలు పూర్తి చేసుకొని 24వ వసంతంలోకి అడుగుపెట్టారు.