శ్రీకాకుళం జిల్లాలో ఓ పక్క వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు.. ఈ సమయంలో పెద్ద ఎత్తున జనసంద్రం ఆయన వెంటనడిచి వెళుతున్నారు. ఇక ఇదే అదునుగా కొందరు రాజకీయం చేయాలి అని చూస్తున్నారు అని జిల్లా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. మరి ఎందుకు అనేది తెలుసుకుందాం.
రాజాం నగర పంచాయతీ పరిధి మాధవ బజారు సమీపంలో ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. 80 అడుగుల రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఈ విగ్రహాన్ని తొలగించేందుకు బుధవారం ఆర్అండ్బీ, నగర పంచాయతీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. క్రేన్‌తో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగిస్తుండగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో అధికారులు కూడా విగ్రహం తొలిగిస్తాం అని డ్యామేజ్ లేకుండా చేస్తాం అని చెప్పారు.
విగ్రహాన్ని తొలగించకపోతే రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఉందని అధికారులు వారికి నచ్చజెప్పారు. అయితే, విగ్రహానికి ఎటువంటి హాని కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారులు విగ్రహాన్ని జేసీబీతో తొలగించి వేరే చోటకు తరలించారు. అనంతరం కాలువపై పలకలు ఏర్పాటు చేసి యధావిధిగా దిమ్మను నిర్మించి విగ్రహాన్ని పెట్టారు. దీంతో వైసీపీ అభిమానులు శాంతించారు.