లోకేష్ ట్వీట్ వైరల్

218

మొత్తానికి ఈ ఎన్నికల వేళ ట్వీట్లు కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక హోదా బోరు కొట్టిందని వైసీపీ తన మనసులో మాట బయటపెట్టిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ నోట పలికేవి శుద్ధ అబద్దాలు అన్నారు. వైసీపీ ఎజెండా మొత్తం నీటి మూటలు అని తేలిందని చెప్పారు. జగన్, కేసీఆర్ ఇద్దరిదీ ఒకటే మాట అంటూ లోకేష్ ట్విట్ చేశారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పీవీపీ మాట్లాడిన క్లిపింగ్ యాడ్ చేస్తూ లోకేష్ ట్విట్ చేశారు.