లోకేష్ జాత‌కం సూప‌ర్

434

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కంటే ఆయ‌న కుమారుడు లోకేష్ జాతకం చాలా బాగుంది అని చెబుతున్నారు జ్యోతిష్యులు.తాజాగా జ్యోతిష్య గురువు రమణారావు ఈ విష‌యం తెలియ‌చేశారు.. లోకేష్ జాతకం బాగుండటం వలనే ప్రభుత్వం సక్రమంగా నడుస్తోందని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు పరిస్థితి బాగాలేదని రమణారావు అన్నారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబుకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయన్నారు. ఏపీ సచివాలయంలో భారీ మార్పులు చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా బాగుంటుందని ఆయన జోస్యం చెప్పారు.

Image result for lokesh

అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా జ్యోతిష్య గురువు రమణారావు జోస్యం చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలంటే కొత్త పార్లమెంటుకు శంకుస్థాపన చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు మోదీకి నెగిటివ్ వైబ్రేషన్స్ చూపిస్తున్నాయన్నారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని చెప్పారు.