లక్ష్మీనారాయణకు వివేకానందరెడ్డి సారీ

235

రాజకీయంగా విమర్శలుచేయడం నాయకులపై అయితే పర్వాలేదు కాని, ఏకంగా అధికారులపై విమర్శలు చేయడం అంటే ఇది మాములు విషయం కాదు..మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి.. సీబీఐ మాజీ జేడీ, ప్రస్తుత జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఆసక్తికర విషయాలు బయపెట్టారు. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వివేకా వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.

Image result for jd laxminarayana

లక్ష్మీనారాయణకు, టీడీపీ నేత పయ్యావుల కేశవ్కు బంధుత్వాన్ని అంటగడుతూ.. అప్పట్లో వివేకానంద రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేకా తనకు ఫోన్ చేసి… బాబూ తప్పైంది.. వేరే వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అలా మాట్లాడాను. ఆఫీసుకు వచ్చి క్షమాపణలు చెబుతాను అన్నారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎవరో చెప్పినది విని అలా రియాక్ట్ అయ్యుంటారని.. కాబట్టి దీన్ని అంత సీరియస్గా తీసుకోనవసరం లేదని తాను వివేకాతో చెప్పానన్నారు. తనకు ఏ మీడియాతో సంబంధాలు లేవు బయటకు వచ్చిన లీకులతో ఇలాంటి విమర్శలు చేశారు, సీఎం చంద్రబాబుని తిత్లి తుఫాను సమయంలో కలిశాను అంతే అని తెలియచేశారాయన.