రౌండ్ టేబుల్ లో పవన్ కీలక ప్రకటన

244

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై అందరం కలిసి పోరాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని అందరూ అంగీకరించారని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు. ఈ సమయంలో కూడా మనం పోరాడకపోతే ఇంకా ఎప్పటికీ న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు ఏపీకి అన్యాయం జరిగింది అని అన్నారు, ఇక ఈ సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ మాట్లాడుతూ, ఏపీకి అన్యాయం జరిగింది అని ఈసమయంలో అన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలి అని అన్నారాయన.