రోజా సమక్షంలో వైసీపీలోకి

253

వైసీపీ మహిళా నాయకురాలు నగరి ఎమ్మెల్యే రోజా డైనమిక్ మహిళా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు… ఆమె నగరిలో ఎటువంటి కార్యక్రమం పెట్టినా వేలాది మంది తరలి వస్తారు.. ఇక త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. విజయపురం మండలంలోని కోసలనగరంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువ మంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై విరక్తి చెంది వైసీపీలో చేరుతున్నారని తెలిపారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు అని అన్నారు ఆమె.

Image result for ycp
నవరత్నాల కరపత్రాలను అందరికీ పంచిపెట్టాలని , అందులోని పథకాలను ప్రజలకు తెలియజెప్పాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. పన్నూరు నుంచి 15 మంది, విజయపురం, మల్లారెడ్డికండ్రిగ, నారపరాజుకండ్రిగ, కోసలనగరం గ్రామాల నుండి 25 మంది ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు…వైసీపీలో పెద్ద నాయకుడి నుంచి కార్యకర్త వరకూ అందరికి న్యాయం జరుగుతుంది అని ఆమె తెలియచేశారు.