రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి బంపర్ ఆఫర్

1777

ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల అమలుతో పాటు ప్రతీ ఒక్కరికి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. మంత్రి వర్గ ఉపసంఘం భేటిలో రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీపై తీసుకోవాల్సిన చర్చ జరిగింది. రేషన్ షాపుల ద్వారా కల్తీలేని సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని, రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తెస్తామని చర్చలో పాల్గొన్న నాని అన్నారు.రేషన్ ద్వారా ఈ బియ్యం సరఫరా చేసేందుకు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని వాటిని నేరుగా లబ్దిదారుల ఇళ్లకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. అంతేకాదు ఐదు కేజీలు, పది కేజీలు, 15 కేజీలు, 20 కేజీల సంచులను తీసుకుని అందులో ప్యాక్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. దీని ద్వారా ప్రభుత్వం సన్నబియ్యం సక్రమంగా లబ్దిదారులకు చేరుతాయని చెబుతున్నారు.

ఏపీలో సన్నబియ్యం సంచులు రెడీ... వైఎస్ఆర్,జగన్ ఫోటోలతో రైస్ బ్యాగ్

సన్నబియ్యం పంపిణీ, బియ్యాన్ని ప్యాకింగ్‌ చేయడంవల్ల ఏడాదికి రూ.వెయ్యికోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు తెల్ల కార్డుదారులకు ఇస్తున్న బియ్యం మిల్లర్ల ద్వారా రీసైకిలింగ్‌ అవుతున్నాయి. అలాగే రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న బియ్యంలో 25శాతం నూక ఉండటంతో అన్నం ముద్దలా అవుతోంది. అయితే మిల్లింగ్‌లో నూక 15శాతం కంటే ఎక్కువ రాదని అధికారులు చెబుతున్నారు. దీనిపై దృష్టి పెడతాం. సన్నబియ్యం పేదలకు ఇవ్వాలంటే 6లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని అంచనా వేశాం. ఆ స్థాయిలో సన్నబియ్యం సేకరించామని తెలియచేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం కిలో రూ.36 అవుతోంది. అందులో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద రూ.29 రాయితీ ఇస్తుంటే, మిగతా రూ.7 రాష్ట్రం భరిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల తెల్ల రేషన్‌కార్డులున్నాయి. ఆ కార్డుల ద్వారా సుమారు నాలుగున్నర కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. 2011 లెక్కల ప్రకారం కేంద్రం 2.68 కోట్ల మందికే రాయితీ ఇస్తోంది. మిగతా వారికి ఇచ్చే బియ్యం మొత్తం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పుడు సన్నబియ్యం అంటే ఎంత భారం పడుతుందోనని అధికారులు కసరత్తు చేస్తున్నారు.. పైగా రేషన్‌ లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని 5 నుంచి 7 కిలోలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అప్పుడు రాష్ట్రంపై మరింత భారం పడుతుంది. ప్రస్తుతం ప్రతినెలా సుమారు 20లక్షల మంది రేషన్‌ సరుకులు తీసుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చే డోర్‌ డెలివరీ వ్యవస్థ ద్వారా అయితే బియ్యం తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆ మేరకు సర్కారుపై భారం పడినా ప్రజలకు మాట ఇచ్చాం కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ సన్నబియ్యమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రేషన్ షాపుల దగ్గరకు వెళ్లి క్యూలో ఉండాల్సిన పనిలేదు, వచ్చే నెల నుంచి నేరుగా రేషన్ ఇంటికి చేరనుంది.. ముందుగా ఈ పథకం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనుంది ఏపీ సర్కారు… మరి వాలంటీర్ల ద్వారా రేషన్ ఇంటికి అందించడం అనే పథకం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లరూపంలో తెలియచేయండి.