రేపే ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు బాబు శ్రీకారం

375

కేంద్రం సాయం చేయ‌డం లేదు సీమ ప్రాంతం ఏనాటి నుంచో కోరుతోంది.. ఇక ఎన్నిక‌ల హామీలో భాగంగా ఈ స‌మ‌స్య తీర్చాలి అని చంద్ర‌బాబు ప్ర‌తినబూనారు అనుకున్న‌దే త‌డ‌వుగా కేంద్రానికి వంద‌రోజుల స‌మ‌యం ఇచ్చారు.. ఇక వారు ముందుకు రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ముందుకు వ‌చ్చారు..కడప ఉక్కు పై కేంద్రం ఎంతకీ కదలని నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది.

Image result for chandra babu

గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంటు నిర్మాణంతో వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకావకాశాలు దక్కడంతో పాటు ఉక్కు ఉత్పత్తులతో రాయలసీమ ఆర్థికంగానూ బలోపేతం కానుంది. కడప ఉక్కు ప్లాంటుకు శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక పరిశ్రమకు అవసరమైన నిధులు, ఖనిజం లభ్యత తదితర అంశాలపై కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక్క‌డ పెద్ద ఎత్తున ఉద్యోగాలు యువ‌త‌కు ఉపాది వ‌స్తుంది అని సీమ ప్ర‌జ‌లు ఎప్ప‌టి నుంచో ఈ ఫ్యాక్ట‌రీపై ఆశ‌లు పెట్టుకున్నారు.