రేపు జగన్ సభకు వైసీపీ ప్లాన్స్ ఇవే

300

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈనెల 9 న అంటే రేపటితో ముగియనుంది.. ఇక చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ కేడర్ తరలిరానుంది., ఈ సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు బయలుదేరి నందిగాం ఫ్లై ఓవర్ వద్దకు వస్తే అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందన్నారు.

Related image
ఇచ్ఛాపురంలో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకు పార్టీ శ్రేణులంతా తరలి రావాలని పెద్ద ఎత్తున ఇక్కడ స్ధానిక నేతలు పిలుపుని ఇచ్చారు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే నిమి త్తం 2017 నవంబరు 6న జగన్ యాత్రకు శ్రీకా రం చుట్టారని, దానిలో భాగంగా బుధవారం ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగుస్తుందన్నారు. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నందిగాం పార్టీ కార్యాలయానికి 9న ఉదయం 9గంటలకు చేరుకోవాలన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ దామన్నారు. దాదాపు 10 వేల మంది ఇక్కడకు చేరుకుంటారు అని తెలుస్తోంది.