రాహ‌ల్ నీకు ద‌మ్ముందా కేసీఆర్ స‌వాల్

267

తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌చార ప‌ర్వం కొన‌సాగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం రాజ‌కీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఒక‌రిని మించి మ‌రో పార్టీ స‌భ‌లు స‌మావేశాలు రోడ్ షోల‌తో జ‌నాల‌ని ఆక‌ట్టుకుంటున్నారు.. ప్ర‌చార జోరును పెంచుతున్నారు. ఓ ప‌క్క మ‌హాకూట‌మి కోసం సోనియా రాహుల్ చంద్ర‌బాబు ఉత్త‌మ్ కోదండ‌రాంతో స‌హా ప్ర‌చారాలు చేస్తుంటే, ఇటు కేసీఆర్ కేటీఆర్ హ‌రీష్ రావు టీఆర్ఎస్ గెలుపుకోసం ప్ర‌చారాలు చేస్తున్నారు.

Image result for rahul gandhi and chandrababu

తాజాఆ సీఎం కేసీఆర్ రాహుల్ పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు అలాగే స‌వాల్ విసిరారు…ప్రాజెక్టులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ధీటుగా సమాధానం చెప్పారు. రాహుల్‌గాంధీ జోకర్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇల్లందులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రాహుల్ నీకు దమ్ముంటే రుద్రమ్మకోటకు రా….మీ తండ్రి పేరు మీద ఉన్న రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ఎలా ఉన్నాయో చూద్దామా అని సవాల్ విసిరారు. ప్రాజెక్టుల రిడిజైనింగ్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ దద్దమ్మలు మీరు చెప్పింది విని పిచ్చి ప్రాజెక్టులు పెట్టారు కాబట్టే వాటిని తీసేసి మాకు అవసరమైన ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. మాది కమిషన్ల బతుకు కాదు, పోరాట బతుకులు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ సాధిస్తామ‌ని కేసీఆర్ స‌వాల్ చేశారు.