రాహుల్ తో నారా బ్రాహ్మణి భేటీ..పొత్తు ఖరారేనా…!

495

తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఈ రోజు పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు..నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ భేటీ పలు ఆసక్తికర రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ఈ భేటీకి టీడీపీ వ్యాపారవేత్తలు క్యూ కట్టడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి ఈ భేటీ కి హాజరయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు..ఎంపి టిజి వెంకటేష్ తనయుడు టిజి భరత్, జేసి తనయుడు పవన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు…దగ్గుబాటి సురేశ్‌తోపాటు టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశానికి వచ్చారు.

గత కొంత కాలంగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది..నాలుగేళ్ళు కలిసి పని చేసిన బిజెపి తో విడిపోవడం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దూరమవడంతో రానున్న ఎన్నికల్లో కొత్త మిత్రుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తడం, ప్రజావ్యతిరేకత భారీగా పెరగడంతో ఒంటరిగా ఎన్నికల్లో వెళ్లేందుకు బాబు సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌తో జోడీ కట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయి.